సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని ఫోన్ కొన్న భర్త.. హర్ట్ అయి ఆత్మహత్య చేసుకున్న భార్య.. ఇంతకీ ఏమైంది..
ఇది చూసిన కనై కంగారు పడ్డాడు. ఇది చూసిన కనై షాక్‌తో నేలపై కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి ఇద్దరీ హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కానీ, దురదృష్టవశాత్తు
ప్రస్తుతం ఎక్కడ చూసినా విచ్చలవిడి ఇంటర్‌నెట్ వినియోగం అందుబాటులోకి వచ్చేసింది. పల్లె, పట్నం అనే తేడా లేదు.. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు హల్‌చల్ చేస్తున్నాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, ట్విట్టర్ ఇలా రకరకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తన భార్య చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ ఉండాలనుకున్నాడు ఓ భర్త. భార్యపై ప్రేమతో ఓ ఖరీదైన ఫోన్ కొని గిఫ్ట్ ఇచ్చాడు..కానీ, ఆ గిఫ్టే అతని పాలిట శాపంగా మారింది. అయితే అతడు ఆ ఫోన్‌ని ఈఎంఐలో కొన్నాడని తెలుసుకున్న ఆమె.. భర్త ఎదురుగానే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఒడిశాలోని మల్కన్‌గిరి మండల్ కలిమేలా బ్లాక్ చెందిన జ్యోతికి, కనైకు ఏడాది క్రితం వివాహమయ్యింది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.. దంపతులిద్దరూ మల్కాన్‌గిరి జిల్లాలోని ఎంపీవీ 14 గ్రామంలో నివాసముంటున్నారు. అయితే గతంలో జ్యోతి భర్త ఆమెకు ఖరీదైన ఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక ఆ ఫోన్ కి ఈఎంఐ కడుతూ ఉండగా తాజాగా అది తీరిపోవడంతో ఫైనాన్స్ కంపెనీ వారు జ్యోతి భర్త సంతకం కోసం ఇంటికి వచ్చారు. తన భర్త ఈఎంఐ లో ఫోన్ కొనుగోలు చేశాడు అని తెలుసుకున్న భార్య జ్యోతి తన భర్తతో వాదనకు దిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఆవేశంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
ఇది చూసిన కనై కంగారు పడ్డాడు. ఇది చూసిన కనై షాక్‌తో నేలపై కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి ఇద్దరీ హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కానీ, దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ.. జ్యోతి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కనై షాక్ నుంచి ఇంకా కోలుకోలేదని, ఇంకా చికిత్స పొందుతున్నాడని చెబుతున్నారు. కాగా, జరిగిన ఘటనపై ఎటువంటి ఫిర్యాదు నమోదు కానప్పటికీ, పోలీసులు ఈ సంఘటనపై స్వచ్ఛంద విచారణ ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి