AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: ఇండియాలో మళ్లీ కరోనా సునామీ ఖాయయా? మళ్లీ మహా ముప్పు ముంచుకొస్తోందా?

ఇండియాలో మళ్లీ కరోనా సునామీ ఖాయయా?. మరో వారం పది రోజుల్లో ఏం జరగబోతోంది? త్వరలో నిజంగానే ఫోర్త్‌ వేవ్‌ కల్లోలం సృష్టించబోతోందా?. ఉత్తరాదిన అమాంతం పెరుగుతోన్న కరోనా కేసులు దేనికి సంకేతం?

Coronavirus: ఇండియాలో మళ్లీ కరోనా సునామీ ఖాయయా? మళ్లీ మహా ముప్పు ముంచుకొస్తోందా?
Omicron Variant Bf.7
Ram Naramaneni
|

Updated on: Oct 20, 2022 | 5:35 PM

Share

ఉన్నట్టుండి గొంతు నొప్పిగా ఉందా?, జర్వం-ఒళ్లు నొప్పులతో వీకైపోయారా?, దగ్గు-జలుబుతో ఇబ్బంది పడుతున్నారా? అయితే, బీకేర్‌ఫుల్‌. కాస్త అలసటగా అనిపించినా ఆలోచించాల్సిందే. ఎందుకంటే, కరోనా మరోసారి విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. ఎప్పటికప్పుడు షేప్‌ ఛేంజ్‌ చేసుకుని మరింత శక్తివంతంగా మారుతోన్న కరోనా మహమ్మారి… మళ్లీ మారణహోమం సృష్టించేందుకు బీరెడీ అంటోంది. ఆల్రెడీ BF-7 న్యూ వేరియంట్‌ తెగబడుతోంది. ఇప్పుడు మరో కొత్త వేరియంట్‌ 18 XBB పెను విధ్వంసం సృష్టించేందుకు బస్తీమే సవాల్‌ అంటోంది. అత్యంత వేగంగా విస్తరిస్తోన్న 18 XBB వేరియంట్‌ను మహారాష్ట్రలో గుర్తించారు. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌గా భావిస్తోన్న 18 XBB వైద్యులను కలవరానికి గురిచేస్తోంది.

కరోనా లేదు గిరోనా లేదని… అంతా ఆల్‌ ఈజ్‌ వెల్‌… ఈ కొత్త వేరియంట్స్‌ మమ్మల్నేం చేయలేవ్‌… అంటూ మాస్క్‌ తీసి అవతల పారేసినోళ్లకు సవాల్‌ విసురుతున్నాయ్‌ ఈ న్యూ వేరియంట్స్‌. ఇండియాను శరవేగంగా కమ్మేస్తున్న BF7 అండ్‌ 18 XBBలు… దొరికినోడిని దొరికినట్టు కాటేయడానికి కాచుకుని కూర్చున్నాయ్‌. ఉత్తరాదిన ఆల్రెడీ దడ పుట్టిస్తోన్న కొత్త వేరియంట్స్‌, త్వరలో దేశం మొత్తం కమ్మేయడం ఖాయమంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. మరో 10 నుంచి 15 రోజుల్లో ఫోర్త్‌ వేవ్‌ మొదలైనా ఆశ్చర్యపోనవసరం లేదన్నది నిపుణుల మాట. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లో ఆల్రెడీ ఆంక్షలు మొదలైపోయాయ్‌. గత వేరియంట్స్‌తో పోలిస్తే, కొత్త వాటి వేగం చాలా ఎక్కువగా ఉందంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. అందుకే, అందరూ అలర్ట్‌గా ఉండటం ఒక్కటే పరిష్కారమని చెబుతున్నారు.

వైద్యుల హెచ్చరికలు ఎలాగున్నా, కొత్త వేరియంట్స్‌ కేసులు పెరుగుతున్నాయనేది నిజం. కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే జాగ్రత్తలు ఒక్కటే శరణ్యం. బూస్టర్ డోస్ వేయించుకోవడం, మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడమే మార్గం. లేదంటే, మన చావును మన చేతులారా మనమే తెచ్చుకున్నట్టు. బతకాలంటే ఈ జాగ్రత్తలు తప్పదుమరి. లేదంటే, నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. బీ కేర్‌ ఫుల్‌ ఆల్‌.

మరిన్ని జాతీయ వార్తల కోసం