నాన్‌వెజ్‌ విషయంలో భార్యభర్తల మధ్య గొడవ.. జోక్యం చేసుకున్న పక్కింటి వ్యక్తి దారుణ హత్య.. ఏం జరిగిందంటే..

మంగళవారం రాత్రి, అహిర్వార్ చికెన్ తెచ్చి వండమని భార్యను కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. మంగళవారం నాన్ వెజ్ ఫుడ్ తినవద్దని అతని భార్య కోరింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి గొడవకు దారితీసింది.

నాన్‌వెజ్‌ విషయంలో భార్యభర్తల మధ్య గొడవ.. జోక్యం చేసుకున్న పక్కింటి వ్యక్తి దారుణ హత్య.. ఏం జరిగిందంటే..
Murder Case
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 20, 2022 | 9:01 PM

అర్థరాత్రి భార్యభర్తల మధ్య జరిగిన గొడవలో జోక్యం చేసుకున్నందుకు ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. 26 ఏళ్ల యువకుడు అతని భార్యతో గొడవపడుతుండగా, సర్ది చెప్పేందుకు వచ్చిన 45 ఏళ్ల పక్కింటి వ్యక్తిని కొట్టి చంపాడు నిందితుడు. కర్రతో బలంగా బాధితుడి తల, ముఖం, కడుపులో ​కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మృతుడు బల్లునాథ్ (45) బిల్ఖిరియాలోని ఛవ్నీ పత్తర్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. నిందితుడు పప్పు అహిర్వార్ తన భార్య కుంతితో కలిసి పొరుగునే ఉంట్టున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి, అహిర్వార్ చికెన్ తెచ్చి వండమని భార్యను కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. మంగళవారం నాన్ వెజ్ ఫుడ్ తినవద్దని అతని భార్య కోరింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి గొడవకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే అహిర్వార్ కుంతిని కొట్టడం మొదలుపెట్టాడు. ఆమె అరుపులు విన్న బల్లు జోక్యం చేసుకున్నాడు. అయితే అహిర్వార్ అతనిపై కర్రతో దాడి చేసి వెనుక నుండి అతని తలపై బలంగా కొట్టాడు. బల్లు నేలమీద పడిపోయాడు.. అనంతరం అహిర్వార్ ముఖం, పొట్టపై కొట్టి పారిపోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

బిల్లు మృతి తర్వాత నిందితుడి భార్య వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అదే రోజు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి