AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్నకు స్విగ్గీలో ఉద్యోగం.. ఎగిరి గంతేసిన కూతురు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

వీడియో చూసిన నెటిజన్లు తమ బావోద్వేగాలను తెలియజేస్తున్నారు. తండ్రీ కూతుళ్ల ఆనందం ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నారు.

నాన్నకు స్విగ్గీలో ఉద్యోగం.. ఎగిరి గంతేసిన కూతురు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Little Girl
Jyothi Gadda
|

Updated on: Oct 20, 2022 | 8:45 PM

Share

ఈ భూమ్మీద అన్ని బంధాల్లో కెల్ల తండ్రీకూతుళ్ల అనుబంధం వేరు. తండ్రీకూతుళ్ల బంధం మాటల్లో చెప్పలేం. వర్ణించడం కూడా సాధ్యంకాదు. కూతుళ్ల సంతోషం కోసం తండ్రులు ఏం చేయడానికైనా సిద్ధపడతారు.ఎవరికీ అర్థం కాని సెంటిమెంట్‌ల దారంతో ఇద్దరూ ఒకరికొకరు కనెక్ట్ అవుతుంటారు.. కాబట్టి కూతుళ్లు కూడా తండ్రి ఎదుట ఎవరి మాట వినరు. అలాంటి తండ్రీ కూతుళ్ల బంధానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని పూజా అవంతిక అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వైరల్ వీడియోలో, ఒక చిన్న అమ్మాయి తన తండ్రికి స్విగ్గీలో కొత్త ఉద్యోగం వచ్చినప్పుడు ఆమె పొందిన ఆనందం అంతా ఇంతా కాదు.. ఆమె ఆనందంతో ఎగిరి గంతేస్తూ తండ్రిని కౌగిలించుకున్న తీరు నెటిజన్లను సైతం ఆనందంతో కన్నీళ్లు పెట్టిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

వీడియోలో ఓ చిన్నారి కళ్లు మూసుకుని కనిపిస్తోంది. అంతలోనే ఆమె తండ్రి ఆమె ముందుకు వస్తాడు. తన చేతిలో స్విగ్గీ టీ షర్ట్ పట్టుకుని ఉన్నాడు. అంటే అతను స్వీగ్గీలో జాబ్ పొందినట్టుగా అర్థం అవుతుంది. అది తెలుసుకున్న ఆ చిన్నారి సంతోషంతో ఎగిరి గంతెసింది. తండ్రిని హగ్ ఆనందం వ్యక్తం చేస్తుంది. ఆ తండ్రీ కూతుళ్ల సంతోషం వారి మొహం, కళ్లలో కనిపిస్తోంది. ఆ ఆనంద క్షణాలను వీడియో తీసిన వారు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో వీడియో కాస్త నెట్టింట తెగ సందడి చేస్తోంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూసిన నెటిజన్లు తమ బావోద్వేగాలను తెలియజేస్తున్నారు. తండ్రీ కూతుళ్ల ఆనందం ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నారు. వీడియోని మరింత షేర్ చేస్తూ వైరల్ గా మార్చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతులు..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతులు..
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..