అలాంటివారు బతికున్న శవాలతో సమానం.. మునుగోడులో సంచలనంగా మారిన పోస్టర్లు

నల్గొండ జిల్లాలో విచిత్ర పోస్టర్లు వెలిశాయి. జిల్లా వ్యాప్తంగా రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్లు సంచలనం రేపుతున్నాయి. మీ ఓటును అమ్ముకోకండి అనే సందేశంతో ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.

అలాంటివారు బతికున్న శవాలతో సమానం.. మునుగోడులో సంచలనంగా మారిన పోస్టర్లు
Posters
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 20, 2022 | 8:38 PM

మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హీట్ ను మరింత పెంచుతోంది. నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉపఎన్నికలకు ముందు నల్గొండ జిల్లాలో విచిత్ర పోస్టర్లు వెలిశాయి. జిల్లా వ్యాప్తంగా రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్లు సంచలనం రేపుతున్నాయి. మీ ఓటును అమ్ముకోకండి అనే సందేశంతో ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. కేవలం రెండు నోట్లు, మద్యం బాటిల్ కోసం తమ ఓటును వృధా చేసుకోవద్దని గుర్తుతెలియని వ్యక్తులు ప్రజలకు, ఓటర్లకు గుర్తు చేస్తూ పోస్టర్లు వేశారు.

మునుగోడు ఉప ఎన్నికల బరిలో నిలిచిన రాజకీయ పార్టీలను ఉద్దేశించి ఆ పోస్టర్లలో ఐదేళ్ల భవిష్యత్తును చేతినిండా నోట్లకు, మద్యం కోసం అమ్ముకునే వ్యక్తి శవంతో సమానం! అని రాసి ఉంది. పోస్టర్లలో మీ ఓటును అమ్ముకోవద్దు..! సంక్షేమం, సామరస్యం, సామాజిక న్యాయం, అభ్యుదయం,నీతి, అర్హత, నిబద్ధత, సమర్థత కోసం ఓటు వేయండి…ఓటు వేయండి! దేశాన్ని మార్చండి..అంటూ పోస్టర్లలో రాసి ఉంది.

ఇవి కూడా చదవండి
Munugode Bypolls

మునుగోడులోని పలు ప్రాంతాల్లో ఇలాంటి పోస్టర్లే ఎక్కడ చూసిన దర్శనమిచ్చాయి. ఈసారి వెనుకబడిన వర్గాలను ఉద్దేశించి, “బానిసలుగా ఉండకండి! మేల్కొనండి! బాధ్యతగా ఓటు వేయండి! BC మరియు ఇతర బలహీన వర్గాలను ఆదుకునే రాజ్యం మాకు కావాలి. బానిసలు అవసరం లేదు!” మునుగోడు నియోజకవర్గానికి నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో ఓటును నోట్లకు, మద్యం బాటిల్‌కు అమ్ముకునే ప్రజానీకం శవంతో సమానం. అందుకే మీ అమూల్యమైన ఓటును అమ్ముకోకండి అంటూ ఎక్కడికక్కడ పోస్టర్లు అంటించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి