Minister Kishan Reddy: నడ్డాకి సమాధి కడతారా.. ఉన్మాద చర్యలు ఆపకపోతే చూస్తూ ఊరుకోబోం.. వార్నింగ్‌ ఇచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఒక జాతీయ పార్టీ అధ్యక్షునికి ఇలా చేసే నీచ సంస్కృతి టీఆర్ఎస్‌కు మాత్రమే చెల్లుతుందంటూ మండిపడ్డారు. ఆరోపణలు, వికృత చేష్టలకు ఓ హద్దు ఉండాలని హితవు పలికారు.

Minister Kishan Reddy: నడ్డాకి సమాధి కడతారా.. ఉన్మాద చర్యలు ఆపకపోతే చూస్తూ ఊరుకోబోం.. వార్నింగ్‌ ఇచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 20, 2022 | 9:09 PM

ఎవరు కట్టారో, ఎందుకు కట్టారోగానీ చౌటుప్పల్ మండలంలో జేపీ నడ్డా పేరుతో ఉన్న సమాధి ఇప్పుడు బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య పెను వివాదాన్ని సృష్టిస్తోంది. టీఆర్‌ఎస్ నేతలే ఈ వ్యవహారానికి కారణంగా చూస్తోంది బీజేపీ. జేపీ నడ్డాకు సమాధి కట్టిన అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షునికి ఇలా చేసే నీచ సంస్కృతి టీఆర్ఎస్‌కు మాత్రమే చెల్లుతుందంటూ మండిపడ్డారు. ఆరోపణలు, వికృత చేష్టలకు ఓ హద్దు ఉండాలని హితవు పలికారు. ఇవన్నీ దాటి టీఆర్ఎస్ వ్యవహరిస్తోందన్నారు. బయ్యారంలో ఎలాంటి హామీ కేంద్రం ఇవ్వలేదన్నారు. కానీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. తాము తెగిస్తే మీరు తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

రాష్ట్రంలో మాఫియాలన్నీ కల్వకుంట్ల కుటుంబం చేతిలోనే ఉన్నాయని కేంద్ర మంత్రి ఆరోపించారు. దోచుకోవడం.. దాచుకోవడం టీఆర్ఎస్ నేతలకు పరిపాటిగా మారిందని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక విలువలు, జ్ఞానం లేకుండా బతికున్నవారికి సమాధి కట్టే సంప్రదాయం టీఆర్ఎస్ తీసుకొచ్చిందన్నారు. జేపీ నడ్డా ఇక్కడ పోటీ చేసి గెలిచారా.. ఆయన సమాధి కట్టే నీచ, నికృష్ట చర్యలకు దిగుతారా అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

ఉపఎన్నికలో ఒక ఊరికి సీఎం ఇన్‌ఛార్జ్‌గా వుండటం గతంలో లేదని, భవిష్యత్‌లో జరగదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ దత్తత తీసుకుంటామని కేసీఆర్, కేటీఆర్ హామీ ఇస్తారని.. తర్వాత మర్చిపోతారని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. ఓవైపు మునుగోడులో బీజేపీ సభలను అడ్డుకుంటున్న అధికారపార్టీ, ప్రేక్షకపాత్ర పోషిస్తున్న పోలీసులపై సంయమనంతో ఉన్నామన్నారు. సహనాన్ని పరీక్షించి ఉన్మాద చర్యలకు దిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం