AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అటు అతనితో.. ఇటు ఇతనితో.. చివరకు ఊహించని ఘోరం.. రోడ్డున పడ్డ కుటుంబం..

ఇది ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ.. ఔను.. జవాన్‌కు ఆమె అంటే ఇష్టం.. పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడయ్యాడు. ప్రపోజల్‌ ప్రాసెస్‌లో అడపాదడపా కలవడాలు. హ్యాండ్‌ షేకింగ్‌లు..

Telangana: అటు అతనితో.. ఇటు ఇతనితో.. చివరకు ఊహించని ఘోరం.. రోడ్డున పడ్డ కుటుంబం..
Adilabad Triangle Love Stor
Shiva Prajapati
|

Updated on: Oct 20, 2022 | 9:10 PM

Share

ఇది ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ.. ఔను.. జవాన్‌కు ఆమె అంటే ఇష్టం.. పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడయ్యాడు. ప్రపోజల్‌ ప్రాసెస్‌లో అడపాదడపా కలవడాలు. హ్యాండ్‌ షేకింగ్‌లు.. కుబుర్లు.. షికార్లు.. ఎక్సట్రా ఎక్సట్రా నడిచాయి. ఇంత వరకూ ఓకే.. కానీ. ఈ ఫ్రేమ్‌లో మరో కత కూడా నడిచింది. జవానేమో ఆమెపై మనసు పడ్డాడు. ఆమె చూపు మాత్రం మరోవైపు ఉంది. మరి ఇతని మనసులో ఏముంది?

జవాన్ సంతోస్, అమ్మాయి వాళ్లిద్దరిదీ బ్యాచిలర్‌ లైఫ్‌.. బండారి కిరణ్‌కు మాత్రం పెళ్లి అయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబం అంటే ఎంతో ప్రేమ, భాద్యతగా ఉండేవాడు. ఆలుమగలు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు. కానీ యువతి ఫోన్‌లో కాంటాక్ట్‌ రావడంతో కత మరో టర్న్‌ తీసుకుంది. ఆమెతో పరిచయం అంతకంతకు పెరుగుతూపోయింది. ఇంట్లో ఛాయ్‌ పే చర్చ.. వాకిట్లో ఆమెతో ముచ్చట.. మేనేజ్‌ చేయడం కష్టమే. కానీ ఇష్ట పడ్డాక మేనేజ్‌ చేయక తప్పదు కదా.

ఇక ఆమె కూడా ఇతనిలో ఈ సీన్లు, మరోవైపు జవాన్‌తో ఫోన్‌ పే కబుర్లు. డ్యూయల్‌ సిమ్స్‌ను చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్‌ చేసింది. అతని ముచ్చట ఇతనికి.. ఇతని ముచ్చట అతనికి తెలియనంత వరకు ఎలాంటి సమస్యా రాలేదు. అయితే, ఈ ముగ్గురూ ఒకరికి ఒకరు బాగా తెలుసు. దగ్గరి బంధువులు కూడా. వీళ్లద్దరికి ఆమె కోడలు వరుస అవుతుంది. ఈవిడ గారిని పెళ్లి చేసుకోవాలని బోర్డర్‌ నుంచే కర్చీఫ్‌ వేశాడు జవాన్‌. కానీ అప్పటికే కిరణ్‌కు, ఆమెకు మధ్య బోర్డర్ చెరిగిపోయింది. మరి ఇలాంటి ముచ్చట్లు దాచినా దాగవు కదా. చివరకు జవాన్‌ చెవిన పడనే పడ్డాయి. అంతే తను ప్రేమించిన యువతిని ట్రాప్‌ చేశాడని కజిన్‌ బ్రదర్‌పై రగిలిపోయాడు జవాన్‌ సంతోష్. తన బ్రదర్‌తో పాటు తన ఫ్రెండ్స్‌తో చర్చోప చర్చలు సాగించాడు. సరిలేరు తనకెవ్వరనే లెవల్‌లో దృశ్యం సినిమాను తలదన్నే స్కెచ్చేశాడు. ప్లాన్‌ ప్రకారం మద్యం పార్టీ.. అడవిలో వంటా వార్పు.. అన్నాదమ్ముల అలాయ్‌ బలాయ్‌.. ఫోటోలు క్లిక్‌మన్నాయి. కట్‌ చేస్తే.. మలిన ప్రేమ కథా చిత్రమ్‌లో మర్డర్‌ చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి

పార్టీ పేరుతో కిరణ్‌ను ఆహ్వానించిన సంతోష్.. తన స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేశారు. నిజం బయటకు రాకుండా ఉండేందుకు శవాన్ని మాయం చేశారు కూడా. నేషనల్‌ హైవే 44 పక్కన.. డంపింగ్‌ యార్డులో డెడ్‌బాడీని పాతేశారు. అనంతరం సిపాయి సంతోష్‌ అతనితో పాటు వచ్చి హత్యలో పాల్గొన్న ఇద్దరు జవాన్లు బోర్డర్‌కు వెళ్లిపోయారు. నిజం సమాధి అయినట్లేనని భావించి నిందితులు ఎంచక్కా చక్కేశారు. కానీ, నిజం తెరపైకి వచ్చింది. పారిశుద్య కార్మికుడు చెత్తకుప్పలో శవాన్ని గమనించడంతో బండారి కిరణ్‌ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది.

సెప్టెంబర్‌ 28 నుంచి కిరణ్‌ ఆచూకీ లేదు. దాంతో ఆదిలాబాద్‌ మావల పీఎస్‌లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. ఎవరితో శత్రుత్వం లేదు. వివాదాలు లేవు. కానీ కిరణ్‌ భార్య భాగ్య శ్రీకి వచ్చిన అనుమానం..ఆమె ఇచ్చిన చిన్న సమాచారంతో కిరణ్‌ మర్డర్‌ కేసులో కీలక మలుపులు తెరపైకి వచ్చాయి. ‘ఎవరో పిల్లను పట్టుకొని వెళ్లుంటాడు.. పైసాలు అయిపోయాక తిరిగి వస్తాడు..’ ఇదీ అమ్మలాంటి వదినమ్మతో సిపాయి సంతోష్‌ చెప్పిన మాటలు. ఆ మాటల వెనుక విషయం ఏంటో విషం ఏంటో దర్యాప్తులో తేలింది. యువతి సోదరుడు శివకుమార్‌. సహా తనఫ్రెండ్స్‌ మందు పార్టీ పేరిట మర్డర్‌కు కుట్రపన్నినట్లు తేల్చారు పోలీసులు. బండారి కిరణ్ హత్య కేసులో తాళ్లపల్లి శివకుమార్, చింతల రోహిత్ రెడ్డి, సగ్గం రామకృష్ణ రెడ్డి, తాళ్లపల్లి రమేష్‌ లను అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు అయిన జవాన్‌ సంతోష్‌ సహా పరారీలో ఉన్న నిందితులను కూడా త్వరలోనే కటకటాల బాటపట్టిస్తామన్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..