AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top 9 News: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని టాప్-9 పల్లె వార్తలు చదవేద్దాం పదండి

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని పల్లెల నుంచి ప్రధాన వార్తలు మీ ముందుకు తీసుకొచ్చాం. చదివేద్దాం పదండి.

Top 9 News:  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని టాప్-9 పల్లె వార్తలు చదవేద్దాం పదండి
Top 9 News Of The Day
Ram Naramaneni
|

Updated on: Oct 20, 2022 | 9:49 PM

Share
  1. నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై కత్తితో దాడి చేసి పారిపోయాడో వ్యక్తి. కొడవలూరు మండలం నార్త్‌రాజుపాలెంలో మహిళ ఆటోలో వెళ్తుండగా.. బలవంతంగా బయటకు లాగాడు. ఆ తర్వాత విచక్షణారహితంగా కత్తితో విరుచుకుపడ్డాడు. ఈ దాడిలో మహిళ రెండు చేతులకి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు కేకలు వేయడంతో.. అక్కడి నుంచి పారిపోయాడు.
  2. అమరావతి రైతుల పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చేరింది. అనపర్తిలో అమరావతి రైతులకు బ్రహ్మరథం పట్టారు స్థానిక నేతలు, ప్రజలు. పాదయాత్రలో పాల్గొన్న మహిళలు, రైతులకు పాలాభిషేకం చేశారు అనపర్తి వాసులు. రాష్ట్రానికి ఒకే రాజధాని.. అది అమరావతి అంటూ స్లోగన్స్ ఇచ్చారు అనపర్తి వాసులు.
  3. భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా కలెక్టర్‌ చండ్రుగొండ మండలంలో పర్యటించారు..ప్రాధమిక పాఠశాలలో మన ఊరు మనబడి పనులను పరిశీలించారు కలెక్టర్‌..పెండింగ్‌లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు..అనంతరం కాసేపు విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు
  4. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు..30 మంది సిబ్బందితో కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు..సరైన పత్రాలు లేని 50 బైక్‌లను సీజ్ చేశారు..ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రజలకు పోలీసులు సూచించారు..
  5. ప్రజలకు అందాల్సిన రేషన్‌ బియ్యం అక్రమరవాణా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది..బాపట్లజిల్లా నూతలపాడులో కాకినాడకు లారీలో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 520 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు..పక్కా సమాచాంతో దాడి చేసిన పోలీసులు 520 బస్తాల బియ్యం సీజ్‌ చేశారు..అటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు
  6. అంతర్‌రాష్ట్ర కిడ్నాపర్ల ముఠాను అరెస్ట్ చేశారు నిర్మల్‌ జిల్లా పోలీసులు..పెద్దపల్లి జిల్లాకు చెందిన రవి అనే ఆర్ఎంపీని ప్రేమపేరుతో ట్రాప్ చేసింది ఓ మహిళ. మహారాష్ట్రకు రప్పించి, ఐదు లక్షలు డిమాండ్‌ చేసింది. కిడ్నాపర్లు పట్టుబడడంతో కథ సుఖాంతం అయ్యింది. వారి నుంచి దేశీయ పిస్తోల్‌, రెండు తూటాలు, ఐదు మొబైల్‌కు స్వాధీనం చేసుకున్నారు..
  7. బాపట్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామంలో మతిస్థిమితం లేని తల్లిపై కొడుకు, కుత్తూరు గొడ్డలితో దాడి చేశారు..దీంతో ఆమెకు గాయాలైయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం చీరాల నుండి ఒంగోలు తీసుకెళ్తుండగా చనిపోయింది..నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  8. కృష్ణాజిల్లా గన్నవరంలో మైనర్‌ బాలికపై ఇద్దరు ఆటో డ్రైవర్లు అత్యాచారానికి యత్నించారు.. కేసరపల్లి గ్రామం వద్ద ఆటో ఎక్కిన బాలికను, ఆటోలో గ్యాస్‌ లేదంటూ వేరే మార్గంలో తీసుకెళ్తుండగా బాలిక కేకలు వేసింది..దీంతో అక్కడే ఉన్న పొలం రైతలు చిన్నారి కాపాడి, నిందితులను ఇద్దరిని పోలీసులకు అప్పగించారు..
  9. అడవి ఒడిలో దండారి సంబరం మొదలైంది.ఆదివాసీల ఆరాధ్యదైవమైన ఏత్మాసూర్‌ పద్మల్‌పురి కాకో ఆలయంలో ఉత్సవాలు మొదలైయ్యాయి..దీంతో తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా మ‌హారాష్ట్ర , చత్తీస్‌గఢ్‌, ఒడిస్సా ప్రాంతాల నుంచి ఆదివాసులు వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు.