Police Jobs: నిరుద్యోగులకు సీఎం జగన్ దీపావళి గిఫ్ట్.. భారీగా పోలీస్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్..
నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. 6,511 పోలీస్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. నిరుద్యోగులకు సీఎం జగన్ దీపావళి గిఫ్ట్ ప్రకటించారు. భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 6,511 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఏపీఎస్పీలో 2,520 కానిస్టేబుల్, 3,580 సివిల్ కానిస్టేబుల్, 315 సివిల్ ఎస్‌ఐ, 96 రిజర్వ్ ఎస్‌ఐ పోస్టుల భర్తీకి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
- రిజర్వ్ విభాగంలో ఎస్సై పోస్టులు-96
- సివిల్ విభాగంలో ఎస్సై పోస్టులు-315
- ఏపీ స్పెషల్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టులు-2520
- సివిల్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టులు-3580
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..