మావోయిస్టు ఏరియాలో భద్రతా బలగాల సెర్చ్‌ ఆపరేషన్.. పది కిలోల పైప్‌ బాంబ్‌ స్వాధీనం

పెట్రోలింగ్‌ చేపడుతున్న బలగాలే లక్ష్యంగా అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఐఈడీని అమర్చినట్లు సమాచారం అందింది. పక్కా సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న బలగాలు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి.

మావోయిస్టు ఏరియాలో భద్రతా బలగాల సెర్చ్‌ ఆపరేషన్.. పది కిలోల పైప్‌ బాంబ్‌ స్వాధీనం
Chhattisgarhs Kanker
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 20, 2022 | 9:14 PM

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్‌ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులు అమర్చిన శక్తివంతమైన ఐఈడీ (Improvised Explosive Device)ని గుర్తించినట్టుగా పోలీసులు తెలిపారు. సుమారు పది కిలోల బరువైన పైప్‌ ఐఈడీ ను స్వాధీనం చేసుకొని, అక్కడికక్కడే సైనికులు పైప్‌బాంబ్‌ను నిర్వీర్యం చేశారని అంతగఢ్‌ ఎస్‌డీఓపీ అమర్‌ సిదర్‌ తెలిపారు. కోయలిబెడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అంతఘర్‌ – టేకపాని గ్రామంలో సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (SDOP), అమర్‌నాథ్ సిదర్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) సభ్యుల బృందం సెర్చ్ ఆపరేషన్‌ సాగించారు.

పెట్రోలింగ్‌ చేపడుతున్న బలగాలే లక్ష్యంగా అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఐఈడీని అమర్చినట్లు సమాచారం అందింది. పక్కా సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న బలగాలు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పైపును స్వాధీనం చేసుకొని, ధ్వంసం చేసినట్లు వివరించారు.