గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం, తేనె కలిపి తాగే అలవాటు మంచిదేనా?
17 March 2026
TV9 Telugu
TV9 Telugu
అధిక బరువు తగ్గడం నుంచి వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడం వరకు నిమ్మనీళ్లు ఎంతో ఉపయోగపడతాయి. కానీ తగ్గించుకోవడమే కష్టం. అందుకే చాలా మంది ఉదయం పరగగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగుతుంటారు
TV9 Telugu
దీని వల్ల శరీర మెటబాలిజం పెరిగి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ నీటిని తాగటం వల్ల శరీరానికి బి1, బి2, బి3, సి విటమిన్లు, పొటాషియం అందుతాయి
TV9 Telugu
రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డీహైడ్రేషన్ ఉండదు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి. మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఉల్లాసం, ఉత్సాహం కలుగుతాయి. మలబద్ధక సమస్య ఉండదు. కీళ్లు బిసుసుకుపోవు
TV9 Telugu
మూత్రం, చెమట రూపంలో శరీరంలో పేరుకున్న వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఊబకాయం కూడా దరి చేరదు. తే నిమ్మ నీళ్లలో బెల్లం, చక్కెర, ఉప్పు వంటివి కలపకూడదు. దీంతో ఈ నీటిలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఈ నిమ్మ నీళ్లను రోజూ తాగడం చాలా సులభం
TV9 Telugu
నీళ్లను కాస్త వేడి చేసి అందులో నిమ్మరసం, తేనె కలిపి తాగేయడమే. ఈ నీళ్ల వల్ల కేవలం 6 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. అందుకనే బరువును తగ్గించడం కోసం ఈ నీళ్లు ఎంతగానో పనిచేస్తాయి
TV9 Telugu
అయితే కొందరు ఈ నీటిలో తేనెకు బదులుగా చక్కెర కలిపి తాగుతుంటారు. బరువు తగ్గాలని చూస్తున్నవారు ఎట్టి పరిస్థితిలోనూ నిమ్మ నీళ్లలో చక్కెర కలపకూడదు. అలా కలిపి తాగితే ఈ నీళ్లను తీసుకుని కూడా ప్రయోజనం ఉండదు
TV9 Telugu
ఇక మరి కొందరు ఈ నీళ్లలో ఉప్పు కలిపి తాగుతారు. ఉప్పును కూడా కలపకూడదు. ఎండవల్ల మీ శరీరం డీహైడ్రేషన్ బారిన పడితేనే అలాంటి సందర్భంలోనే నిమ్మకాయ నీళ్లలో ఉప్పు, చక్కెర కలిపి తాగాలి. అంతేకానీ బరువు తగ్గడం కోసం ఉపయోగించే నిమ్మ నీళ్లలో ఉప్పు, చక్కెర కలపకూడదు
TV9 Telugu
పావు లీటర్ గోరువెచ్చటి నీళ్లలో సగం నిమ్మరసం, ఆరేడు పుదీనా ఆకులు, చెంచా తేనె, చిటికెడు దాల్చినచెక్క పొడి కలిపితే సరిపోతుంది. ఇష్టమైతే రవంత పసుపు, రెండు ఐస్ క్యూబ్స్ కూడా జతచేయొచ్చు.