CTET DEC-2022: సీటెట్ డిసెంబర్ 2022 నోటిఫికేషన్ విడుదల.. ఆన్‌లైన్ దరఖాస్తులు ఎప్పటినుంచంటే..
సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) - డిసెంబర్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. సీటెట్ పరీక్ష ప్రతి యేటా రెండుసార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి గానూ రెండో నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ..
సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) – డిసెంబర్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. సీటెట్ పరీక్ష ప్రతి యేటా రెండుసార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి గానూ రెండో నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయడానికి అర్హత పరీక్షగా సీటెట్‌ను నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్‌లకు జరుగుతుంది. పేపర్-1 ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, పేపర్-2 ఆరు నుంచి తొమ్మిది వరకు తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. ఇక ఈ పరీక్షలో ఒక్క సారి అర్హత సాధిస్తే జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది. దేశ వ్యాప్తంగా జరిగే సీటెట్ పరీక్షను మొత్తం 20 భాషల్లో నిర్వహిస్తారు. పేపర్-1కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా (డీఈఎల్‌ఈడీ)/డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా డిగ్రీ, బీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక పేపర్-2కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీతోపాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ (బీఈడీ)/బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్‌ఈడీ)/బీఎస్సీఈడీ/బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఆయా పేపర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31, 2022వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 24,2022వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తు సమయంలో ఒక్క పేపర్‌కు జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ.1000, రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1200లు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులు ఒక్క పేపర్‌కు రూ.500, రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు రూ.600లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు జరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు..
- పరీక్ష పేరు: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్-2022
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: అక్టోబర్ 31, 2022.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 24, 2022.
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులకు చివరి తేది: నవంబర్ 25, 2022.
- ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీలు: డిసెంబర్ 2022 నుంచి జనవరి 2023 మధ్య నిర్వహిస్తారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.