AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఈ కాలేజ్‌ కుర్రాడికి బట్టలంటే పరమ చిరాకు.. అండర్‌వేర్‌, టవల్‌తోనే రోజూ కాలేజీకి వెళ్తున్న రియల్ లైఫ్ మోగ్లీ!

'జంగిల్‌ బుక్‌' వంటి ఫిక్షన్‌ కథల్లో మోగ్లీ పాత్ర గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. చెట్ల ఆకులు, అలమలు ధరించి తిరుగుతుంటాడు. కానీ నిజజీవితంలో కూడా అటువంటి రియల్‌ మోగ్లీలు కూడా ఉంటారని ఈ యువకుడిని చూస్తే తెలుస్తుంది..

Watch Video: ఈ కాలేజ్‌ కుర్రాడికి బట్టలంటే పరమ చిరాకు.. అండర్‌వేర్‌, టవల్‌తోనే రోజూ కాలేజీకి వెళ్తున్న రియల్ లైఫ్ మోగ్లీ!
Madhya Pradesh's Mowgli
Srilakshmi C
|

Updated on: Oct 20, 2022 | 12:06 PM

Share

‘జంగిల్‌ బుక్‌’ వంటి ఫిక్షన్‌ కథల్లో మోగ్లీ పాత్ర గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. చెట్ల ఆకులు, అలమలు ధరించి తిరుగుతుంటాడు. కానీ నిజజీవితంలో కూడా అటువంటి రియల్‌ మోగ్లీలు కూడా ఉంటారని ఈ యువకుడిని చూస్తే తెలుస్తుంది. అప్పట్లో మధ్యప్రదేశ్ అడవుల్లో పెరిగిన మోగ్లీ అనే బాలుడి కథ దాదాపు అందరికీ సుపరిచితమే. అడవుల్లో దొరికిన ఈ చిన్నారిపై ప్రముఖ నవల రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ ‘జంగిల్ బుక్’ అనే పుస్తకాన్ని రాసేశాడు. మధ్యప్రదేశ్‌లోని బర్వానీకి చెందిన పిచోరి గ్రామానికి చెందిన18 ఏళ్ల కన్హయ్య అవాసీకి కూడా అచ్చాం మోగ్లీ మాదిరి బట్టలు ధరించడం అస్సలు ఇష్టముండదట. అందువల్లనే స్కూల్ యూనీఫాం ధరించకుండా ఓ చెడ్డీ, టవల్‌ మత్రమే ధరించి రోజూ పాఠశాలకు వెళ్తూ ఉండేవాడు. ఈ విధంగా ఇంటర్‌ వరకు చదువుకున్నాడు.

ఐతే అనంతరం కాలేజీ చదువుకు వెళ్తే.. బట్టలు ధరించి రావాల్సిందేనని యాజమన్యం హుకుం జారీ చేసింది. చేసేదిలేక చదువు మానేయాలనుకున్నాడు సదరు యువకుడు. చివరకు కలెక్టర్‌ అనుమతి తీసుకున్న తర్వాతే ప్రవేశం లభించింది. ప్రస్తుతం కన్హయ్య బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి తప్పనిసరిగా దుస్తులు ధరించి వెళ్లవల్సి వస్తుందేమోనని, పదో తరగతి తర్వాత చదువు ఆపేస్తానని కన్నయ్య చెప్పాడు. అందుకు ఉపాధ్యాయులు అంగీకరించలేదు. చాలా శ్రమపడి కళాశాలలో చేర్పించారు. ప్రస్తుతం కన్నయ్య బీఏ చదువుతున్నాడు.

పేద కుటుంబానికి చెందిన కన్హయ్య అందరి విద్యార్థుల్లాగే చదువుతాడు. అతనిని ప్రత్యేకంగా నిలబెట్టేది కేవలం అతని వస్త్రధారణే. ఇప్పటికీ అండర్‌వేర్‌, టవల్‌ తప్ప శరీరంపై ఇంకేమీ ధరించడు. అతనికి చదువు చెప్పే ఉపాధ్యాయులు, సోదరుడు తెల్పిన వివరాల ప్రకారం.. కన్హయ్య తల్లిదండ్రులు కూడా అందరిలా దుస్తులు ధరించరు. ఐతే అతని సోదరుడు మాత్రం బట్టలు ధరిస్తాడు. కన్హయ్య చదివే కాలేజ్‌ ఇన్‌ఛార్జ్‌ మధుసూదన్ చౌబే మాట్లాడుతూ.. ‘కన్హయ్య హ్యాండ్‌ రైటింగ్‌ చాలా బాగుంది. రాత మాత్రమేకాదు చదువులో కూడా మేటి. తోటి విద్యార్థుల మాదిరిగానే మంచి మార్కులు తెచ్చుకుంటాడు. కన్హయ్య సింపుల్‌గా ఉండటంతో పాటు చాలా తక్కువ మాట్లాడుతాడు. క్లాస్‌లో ఎక్కువగా సందేహాలు అడగడు. పలు క్రీడలపై ఆసక్తి ఉన్నట్లు తెలిపారు.