AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. భారీ వర్షాలు

ఒక వైపు చలికాలం వచ్చినా.. వర్షాలు మాత్రం తగ్గడం లేదు. గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక వర్షాలు నమోదు అయ్యాయి. సాధారణంగా అక్టోబర్‌ నెల వరకు వర్షాలు పూర్తిగా త..

Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. భారీ వర్షాలు
Rain Alert
Subhash Goud
|

Updated on: Oct 21, 2022 | 7:22 AM

Share

ఒక వైపు చలికాలం వచ్చినా.. వర్షాలు మాత్రం తగ్గడం లేదు. గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక వర్షాలు నమోదు అయ్యాయి. సాధారణంగా అక్టోబర్‌ నెల వరకు వర్షాలు పూర్తిగా తగ్గిపోతాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఇంకా కురుస్తూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకావర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇక బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి మరో రెండు రోజుల్లో తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అల్పపీడనం కారణంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీని కారణంగా తెలంగాణలో సైతం వర్షాలు కురియనున్నాయి. శుక్రవారం అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ 22న ఉదయానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. అనంతరం.. క్రమంగా బలపడుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అర్ధరాత్రి గోల్కొండ ఔటర్‌రింగ్‌ రోడ్డు టోల్‌ ప్లాజా వద్ద కురిసిన భారీ వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పెద్ద ఎత్తున వరదనీరు పోటెత్తింది. ఈ వరద కారణంగా ఓ లారీ నీటిలో చిక్కుకుపోయింది. ఘటన స్థలానికి పోలీసులు వచ్చి తాళ్ల సహాయంతో బయటకు లాగారు.

ఇవి కూడా చదవండి

ఇక కర్నాటకలో మరో ఐదు రోజులు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. దీంతో బెంగళూరుకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇదిలా ఉంటే.. మరోసారి బెంగళూరును భారీ వర్షాలు వణికించాయి. నగరం అంతా వాన దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వానలు బెంగళూరుని బెంబేలెత్తిస్తున్నాయి. మరోసారి భారీ వాన ముంచెత్తడంతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరదకు ఇళ్లలోని వస్తువులు, బైకులు కొట్టుకుపోయాయి. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు అపార్ట్ మెంట్లు, సెల్లార్లలోకి నీరు చేరింది. నీటిలో వాహనాలు మునిగాయి. బుధవారం రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమైన వాన కుండపోతగా ఏకధాటిగా కురింది. దీంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్తున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అక్కడ ప్రభుత్వం కోరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి