Tamilnadu: ఉప్పొంగుతున్న కావేరీ నది.. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు విలవిల.. మరికొన్ని రోజులు భారీ వర్షాలని హెచ్చరిక

కావేరీ వరదయితే బీభత్సమే సృష్టిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తోంది కావేరీ నది. మెట్టూరు డ్యామ్‌ కెపాసిటీకి మించి వరద వచ్చే అవకాశం ఉండటంతో.. గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు.

Tamilnadu: ఉప్పొంగుతున్న కావేరీ నది.. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు విలవిల.. మరికొన్ని రోజులు భారీ వర్షాలని హెచ్చరిక
Godavari River Floods
Follow us
Surya Kala

|

Updated on: Oct 21, 2022 | 7:15 AM

వరుణదేవుడు పగపట్టాడా అనేంత సీరియస్‌గా ఉంది తమిళనాట పరిస్థితి. ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం కలిసి ఉమ్మడిగా ఆ రాష్ట్రం మొత్తాన్ని అల్లాడించేస్తున్నాయి. ముఖ్యంగా… ఉప్పొంగి ప్రవహిస్తున్న కావేరీ నదితో… తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు విలవిల్లాడిపోతున్నాయి. తమిళనాట కుండపోత కష్టం ఓ రేంజ్‌లో ఉంది. మూడురోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో… నాగపట్నం, తిరువారూర్, మైలాడుదురై, తంజావూరు జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తెన్ పెన్నై, తమిళనాడు-కేరళ బార్డర్లో ప్రవహించే చిన్నారు నది వరద ఉధృతికి అనేక ప్రాంతాల్లో చెరువు కట్టలు తెగిపోయాయి. ధర్మపురి, క్రిష్ణగిరి జిల్లాల్లో వందలాది లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

కావేరీ వరదయితే బీభత్సమే సృష్టిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తోంది కావేరీ నది. మెట్టూరు డ్యామ్‌ కెపాసిటీకి మించి వరద వచ్చే అవకాశం ఉండటంతో.. గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈరోడ్ నుంచి కర్ణాటకకి వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. పరివాహక ప్రాంతాల్లోని 12 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు.

తమ ఇంటి ముందే కావేరి నది ప్రవహిస్తున్నట్టు భీతిల్లిపోయారు జనం. రోడ్లు, రోడ్ల మీదున్న వాహనాలు అన్నీ నీట మునిగాయి. ఇంటి పైకప్పుల మీదికెక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు జనం. వరద ముప్పు ప్రాంతాలలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు NDRF బృందాలు రంగంలో దిగాయి.

ఇవి కూడా చదవండి

ఆందియూర్‌ నుంచి బర్గూరుకు వెళ్ళే దారిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. చెన్నై – బెంగుళూరు మధ్య వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. తమిళనాడులోని ఆరు జిల్లాల్లో మరికొన్నిరోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో… యుద్ధప్రాతిపదికన సహాయకచర్యలకు ఆదేశించారు సీఎం స్టాలిన్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే