- Telugu News Photo Gallery Viral photos Kerala: Sons Carry 87 Year Old Mother On Shoulder To Fulfill Her Wish To Witness Neelakurinji Bloom
Neelakurinji Bloom: 12 ఏళ్లకు ఒకసారి వికసించే పువ్వులను చూడాలనుకున్న తల్లి.. కలియుగ శ్రవణులే ఈ కుమారులు..
పన్నెండుఏళ్లకు పూసే నీలకురింజి పువ్వులు రూపంలోనే కాదు.. గుణం కూడా తనదైన స్పెషాలిటీని కలిగి ఉన్నాయి. వాన చినుకు పడితే చెట్లు పులకరిస్తాయి.. ఆకులు చిగురుస్తాయి. పుష్పాలు వికసిస్తాయి. అందంలోను వాసనలోనూ ఒకొక్క పువ్వుది ఒకొక్క ప్రత్యెక ఉంటుంది. అయితే నీలి రంగుల పువ్వుల సోయగాన్ని 87 ఏళ్ల బామ్మ చూడాలని కోరుకుంది.
Updated on: Oct 17, 2022 | 8:57 AM

ప్రకృతి ప్రేమికుల 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కేరళలో మున్నార్ కొండలు నీలిరంగు పుల తివాచీ పరచుకున్నాయి. ఈ ఏడాది నీలకురంజి విరబుశాయి. ఇడుక్కిలోని శలోం కొండల్లో నీలకురింజి పువ్వులు కనులకు విందు చేస్తున్నాయి. అయితే నీలి రంగుల పువ్వుల సోయగాన్ని 87 ఏళ్ల బామ్మ చూడాలని కోరుకుంది. అయితే అడవుల్లో ఎత్తైన కొండలమీద విరబూసే ఈ పువ్వులను చూడడానికి ఆమె వయసు, ఆరోగ్యం రెండు సహకరించవు. దీంతో తమ తల్లి కోర్కెను తీర్చడానికి తనయులు రెడీ అయ్యారు. దాదాపు 1.5 కిలోమీటర్లు తల్లిని ఎత్తుకుని కల్లిపారా కొండలకు చేరుకున్నారు. ఈ ఘటన కేరళలో చోటులో చేసుకుంది.

కొట్టాయం జిల్లాలోని ముట్టుచిరాకు చెందిన 87 ఏళ్ల ఎలికుట్టి పాల్ వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. పొరుగు జిల్లా ఇడుక్కిలో వికసించిన అరుదైన పువ్వులను చూడాలనుకుంటున్నట్లు తన కుమారులలో ఒకరితో చెప్పారు.

తల్లి కోరికను తీర్చడం కోసం మరో ఆలోచన లేకుండా.. ఆమె కొడుకులు రోజన్, సత్యన్ ఆమెను జీపుపై ఎక్కించుకుని దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించి మున్నార్ సమీపంలోని కల్లిపారా కొండలకు చేరుకున్నారు.

అయితే అక్కడికి చేరుకున్న తర్వాత ఆ తనయులు తెలిసింది.. కొండపైకి వాహనంతో చేరుకోవడానికి రోడ్డు సదుపాయం లేదని.. అయితే తమ తల్లి కోరిన కోర్కెను ఎలాగైనా తీర్చాలని ఇద్దరు కుమారులు భావించారు. వెంటనే తమ వృద్ధ తల్లిని తమ భుజాలపై ఎత్తుకుని 1.5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి కొండపైకి తీసుకుని వెళ్లారు. ఆ కొండ నీలకురింజి పూలతో ఊదారంగు దుప్పటిలా మారింది

దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో షోల అడవుల్లో మాత్రమే కనిపించే నీలకురంజి.. గుబురు పొదకు చెందిన చిన్న మొక్క. నీలి రంగులో ఉండే ఈ పువ్వుల సోయగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..

ఈ పువ్వులను చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. అంత అందం వీటి సొంతం. అందుకనే ప్రకృతి ప్రేమికులు ఈ పువ్వులు వికసించే సమయం కోసం 12 ఏళ్ళు ఎదురుచూస్తారు

అత్యంత ప్రసిద్ధి చెందిన నీలకురింజి వికసించే ప్రదేశం ఇడుక్కి జిల్లాలోని మున్నార్ హిల్ స్టేషన్. ఇక్కడ చివరిసారిగా 2018లో కేరళ వరదలు సంభవించిన సమయంలో నీలకురింజి వికసించాయి. ప్రకృతి ప్రేమికుల ఎదురు చూపులకు చెక్ చెబుతూ ఈ ఏడాది కల్లిపారా కొండలలో 10ఎకరాలకుపైగా ప్రాంతంలో నీలకురింజి పువ్వులు విరబూశాయి. మళ్ళీ మున్నార్‌లో తదుపరి నీలకురింజి పుష్పించేది 2030లో మాత్రమే

ఈ అరుదైన దృగ్విషయాన్ని చూసేందుకు మీరు 2030 వరకు వేచి ఉండాలా అని భావించే ప్రకృతి ప్రేమికులు చింతించకండి. 2018 నుండి నీలకురింజి తమిళనాడులోని కొడైకెనాల్, కర్ణాటకలోని కొడగు, కేరళలోని పూప్పరలో వికస్తున్నాయి. ఈ ఏడాది కర్ణాటకలోని చిక్కమగళూరు, కేరళలోని కల్లిపర ప్రాంతాల్లో నీలకురింజి వికసించాయి.

అరుదైన నీలకురింజి పువ్వుల విశేషం ఏమిటంటే.. ఇవి భారతదేశంలోనే పూస్తాయి. ప్రపంచంలోని మరే దేశంలోనూ ఇవి పూయవు. కేరళలో కూడా కొన్ని ప్రాంతాలలోనే దర్శనమిస్తాయి. అందమైన, అద్భుతమైన, అరుదైన పువ్వు “నీలకురింజి” పువ్వు పేరుతో కూడా ఒక దేవాలయం ఉంది.





























