Doctor Prescription: Rxకి బదులుగా శ్రీ హరిని ఉపయోగించి హిందీలో ప్రిస్క్రిప్షన్ రాసిన డాక్టర్ .. ఫోటో వైరల్

ఆదివారం కేంద్ర హోంమంత్రి కార్యక్రమంలో ఇక నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రిస్క్రిప్షన్లు హిందీలో రాయాలని సూచించిన అనంతరం తాను హిందీలో ప్రిస్క్రిప్షన్ రాయడానికి ప్రేరణ పొందానని డాక్టర్ సర్వేష్ సింగ్ చెప్పారు

Doctor Prescription: Rxకి బదులుగా శ్రీ హరిని ఉపయోగించి హిందీలో ప్రిస్క్రిప్షన్ రాసిన డాక్టర్ .. ఫోటో వైరల్
Doctor Writes Prescription
Follow us

|

Updated on: Oct 18, 2022 | 12:43 PM

దేశంలో వైద్య విద్య ఎంబీబీఎస్ పాఠాలను హిందీ భాషలో భోధించే మొట్టమొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. రెండు రోజుల క్రితం హిందీలో రూపొందించిన వైద్య విద్య పాఠ్యపుస్తకాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిందీలో వైద్య విద్య పుస్తకాలను విడుదల చేసిన మరుసటి రోజు.. మధ్యప్రదేశ్‌లో ఒక వైద్యుడి ప్రిస్క్రిప్షన్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సత్నాలోని డాక్టర్ సర్వేష్ సింగ్ తన ప్రిస్క్రిప్షన్‌ను హిందీలో రాశారు. రోగి  తీసుకోవలసిన మందులను సూచించేటప్పుడు Rx బదులుగా ‘శ్రీ హరి’ని ఉపయోగించారు. ఇప్పటికే హిందీ భాషలో వైద్య విద్యను అందించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగంగా MBBS విద్యార్థుల కోసం అమిత్ షా మూడు సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలను హిందీలో విడుదల చేశారు.

ఆదివారం కేంద్ర హోంమంత్రి కార్యక్రమంలో ఇక నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రిస్క్రిప్షన్లు హిందీలో రాయాలని సూచించిన అనంతరం తాను హిందీలో ప్రిస్క్రిప్షన్ రాయడానికి ప్రేరణ పొందానని డాక్టర్ సర్వేష్ సింగ్ చెప్పారు. అంతేకాదు.. ఈరోజు నుంచి దీన్ని ఎందుకు అమలు చేయకూడదని భావించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ప్రిస్క్రిప్షన్ ఫోటో ప్రకారం, రోగికి పొత్తి కడుపులో నొప్పి ఉన్నట్లు తెలుస్తోంది. డాక్టర్ మొత్తం కేస్ హిస్టరీని హిందీలో రాశారు. ఆ తర్వాత అతను మందులను హిందీలో సూచించారు. అంతేకాదు Rxకి బదులుగా ‘శ్రీ హరి’తో ప్రిస్క్రిప్షన్లు రాయడం ప్రారంభించారు.  హిందీలో ఐదు రకాల మందులను సూచించారు.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ప్రిస్క్రిప్షన్ ఫోటో

హిందీలో వైద్య విద్యను అందించాలనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం చొరవను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఇది దేశంలో  సానుకూల మార్పును తీసుకువస్తుందని అన్నారు.

దీనితో లక్షలాది మంది విద్యార్థులు తమ సొంత భాషలో చదువుకునే అవకాశం ఉండగా, వారికి అనేక అవకాశాలు లభించే అవకాశాలు అధికం అవుతాయని అనాటమీ, ఫిజియాలజీ సబ్జెక్ట్ పుస్తకాలను ఆవిష్కరించిన.. అమిత్ షా ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఇదే విషయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ..  “మెడికల్ , ఇంజనీరింగ్ కోర్సులను హిందీలో నేర్చుకోలేము ..  బోధించలేము అనే అభిప్రాయాన్ని ఇది మారుస్తుందన్నారు. ఎవరైనా దైర్యం చేసి.. ఒక అడుగు ముందుకు వేసి.. తీసుకునే నిర్ణయాలను ఆచరణలో పెట్టడం గొప్ప విషయం అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..