AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Robbery: బ్యాంక్ ను దోచుకోవడానికి వచ్చిన దొంగ.. దైర్యంగా ఎదుర్కొన్న మహిళా మేనేజర్..

వాస్తవానికి బ్యాంకులోకి కత్తితో ప్రవేశించిన దుండగుడిని అక్కడి లేడీ మేనేజర్ అడ్డగించింది. ఆ దుండగుడితో గొడవపడి ఆమెను పారిపోయేలా చేసింది. ఆ దుండగుడు తనను గుర్తు పట్టకుండా.. నోటిని తెల్లటి కండువాతో కట్టుకున్నాడు.

Bank Robbery: బ్యాంక్ ను దోచుకోవడానికి వచ్చిన దొంగ.. దైర్యంగా ఎదుర్కొన్న మహిళా మేనేజర్..
Marudhara Bank
Surya Kala
|

Updated on: Oct 18, 2022 | 9:02 AM

Share

ఎన్ని చట్టాలు తెచ్చినా దొంగలు, మోసగాళ్లకు అడ్డుకట్ట పడడం లేదు. అంతేకాదు.. దొంగోళ్లు మరింత నిర్భయంగా మారారు. ఎంతగా అంటే.. వారు పోలీసులకు భయపడడం లేదు.. లేదా పట్టుకున్న తర్వాత తమకు ఏమి జరుగుతుందో అని వారు భయపడడం లేదు. అయితే ఒకొక్కసారి దొంగలను, దుర్మార్గులను పట్టుకునే సమయంలో ప్రజలు తీవ్రంగా గాయపడతారు లేదా వారిని పట్టుకోవడం విఫలం అవుతారు. చాలాసార్లు అగంతకులు బైక్‌పై వచ్చి మెడలోని గొలుసు లాగి పారిపోవడం లేదా నిర్భయంగా బ్యాంక్ ఏటీఎం లోకి వెళ్లి దొంగతనం చేయడం, లేదా చాలామంది అగంతకులు బ్యాంకుల్లోకి ప్రవేశించడం మీరు  చూసి ఉంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. తరువాత ప్రశంసల వర్షం కురిపిస్తారు.

వాస్తవానికి బ్యాంకులోకి కత్తితో ప్రవేశించిన దుండగుడిని అక్కడి లేడీ మేనేజర్ అడ్డగించింది. ఆ దుండగుడితో గొడవపడి ఆమెను పారిపోయేలా చేసింది. ఆ దుండగుడు తనను గుర్తు పట్టకుండా.. నోటిని తెల్లటి కండువాతో కట్టుకున్నాడు. చేతిలో కత్తిని పట్టుకున్నాడు. బ్యాంక్ ను దోచుకోవడానికి బ్యాంకులోకి ప్రవేశించాడు. అతను కత్తితో అక్కడ ఉన్న లేడీ మేనేజర్ ను భయపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే మహిళ అతనితో గొడవపడింది. అగంతకుడు కత్తితో బెదిరిస్తుండగా.. మహిళ చేతికి ఒక ఇనుప వస్తువు దొరికింది. దాని సహాయంతో ఆమె దొంగను భయపెట్టి పారిపోయేలా చేసింది. అక్కడ ఉన్న మహిళ , ఇతర ఉద్యోగులు దొంగని అక్కడ నుంచి పారిపోయేలా చేసింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో లేడీ మేనేజర్ చూపిన దైర్యం నెటిజన్లను ఆకట్టుకుంది. నీ ధైర్యానికి మా సలాం అంటున్నారు..  ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఐఆర్‌ఎస్ అధికారి డాక్టర్ భగీరథ్ చౌదరి తన ట్విట్టర్ ఖాతాలో  షేర్ చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరుధరా బ్యాంక్ మేనేజర్ పూనమ్ గుప్తా తన ధైర్యాన్ని ప్రదర్శించి బ్యాంక్ లో దొంగతనం చేయడానికి వచ్చిన దుర్మార్గుడిని పారిపోయేలా చేశారు.

45 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు 20 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..