Karwa Chauth: కర్వా చౌత్ వస్తే..ఈ వీడియో వైరల్ అవ్వాల్సిందే.. ముగ్గురు భార్యలతో పండగ జరుపుకుంటున్న కృష్ణుడు

కృష్ణ ఓ షాపులో పనిచేసేవాడు. ఈ క్రమంలో యజమాని కూతురు శోభతో ప్రేమలో పడి ఇద్దరూ గుడిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక సొంత ఇంట్లోనే ఉండడం మొదలుపెట్టాడు. ఈ సమయంలో అతను శోభ సోదరి రీనాతో కూడా ప్రేమలో పడ్డాడు.

Karwa Chauth: కర్వా చౌత్ వస్తే..ఈ వీడియో వైరల్ అవ్వాల్సిందే.. ముగ్గురు భార్యలతో పండగ జరుపుకుంటున్న కృష్ణుడు
Karwa Chauth Celebration
Follow us

|

Updated on: Oct 16, 2022 | 7:40 PM

కర్వా చౌత్ తర్వాత, బిజెపి నాయకుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో అతను ఇద్దరు భార్యలతో కనిపించాడు. ఇంతలో.. ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ముగ్గురు భార్యలు భర్తతో కలిసి కర్వా చౌత్ పండుగను జరుపుకుంటున్నారు. ఒక వ్యక్తి తన ముగ్గురు భార్యలతో కలిసి కర్వా చౌత్ పండుగను జరుపుకుంటున్న పాత వీడియో ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది. వీడియోలో కృష్ణుడిగా గుర్తించబడిన వ్యక్తి తన ముగ్గురు భార్యలతో కలిసి కర్వా చౌత్ ప్రేమగా జరుపుకుంటున్నాడు. వైరల్ అవుతున్న ఈ పాత వైరల్ వీడియో మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌కి చెందినది.

ఒక భర్త కోసం ముగ్గురు భార్యలు నిరాహార దీక్ష: చిత్రకూట్ జిల్లాలో కృష్ణ అనే వ్యక్తికి ముగ్గురు భార్యలు, ముగ్గురూ అక్క చెల్లెళ్లతో వివాహం జరిగింది. కృష్ణకు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. ముగ్గురు భార్యలు కృష్ణుడి కోసం కర్వా చౌత్ ఉపవాసం ఉంటారు. చంద్రుని చూసి.. తర్వాత భర్తను చూసిన తర్వాత మాత్రమే వారి ఉపవాసాన్ని విరమిస్తారు. సోషల్ మీడియాలో అతని వీడియో ప్రతి సంవత్సరం వైరల్ అవుతుంది. ఈసారి కూడా అదే జరిగింది. అతని ఫోటో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ఉంది.

ఇవి కూడా చదవండి

మూడు పెళ్లిళ్లు ఎలా జరిగాయంటే? సమాచారం మేరకు కృష్ణ ఓ షాపులో పనిచేసేవాడు. ఈ క్రమంలో యజమాని కూతురు శోభతో ప్రేమలో పడి ఇద్దరూ గుడిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక సొంత ఇంట్లోనే ఉండడం మొదలుపెట్టాడు. ఈ సమయంలో అతను శోభ సోదరి రీనాతో కూడా ప్రేమలో పడ్డాడు.. ఆపై వారిద్దరూ కూడా గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ముగ్గురూ అద్దెకు ఇల్లు తీసుకుని సహజీవనం ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత పింకీ కృష్ణను కూడా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం నలుగురూ అద్దె ఇంట్లో సంతోషంగా జీవిస్తున్నారు.

ముగ్గురు భార్యలతో కృష్ణుడు:

రాజేష్ సాహు అనే నెటిజన్ తాను ఇంతకు ముందు ఇది నకిలీ అనుకున్నానని.. అయితే అది నిజమేనని తేలిందన్నారు. మా అన్న ధైర్యం చూసి.. అతనికి ప్రభుత్వం నుంచి శౌర్య పతకాన్ని డిమాండ్ చేస్తున్నాను కామెంట్ చేశాడు. భారతీయ చట్టం ప్రకారం హిందువులు బహుళ వివాహాలు చేసుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అతడిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తున్నాడు.  మరికొందరు అతను చాలా అదృష్టవంతుడని..  ముగ్గురూ నిజమైన అక్కాచెల్లెళ్లు చక్కగా ఉన్నారంటూ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..