kantara: కుటుంబంతో కలిసి కాంతారా చూసిన స్టార్‌ హీరోయిన్‌.. ఆస్కార్‌ పక్కా అంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

స్వీటీ అనుష్క, కోలీవుడ్ స్టార్‌ ధనుష్‌, ప్రభాస్‌ లాంటి సెలబ్రిటీలు కాంతారా సినిమా సూపర్బ్‌ అంటూ తమ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్‌ చేసుకున్నారు. తాజగా బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఈ సినిమాను వీక్షించింది.

kantara: కుటుంబంతో కలిసి కాంతారా చూసిన స్టార్‌ హీరోయిన్‌.. ఆస్కార్‌ పక్కా అంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
Kangana Ranaut, Kantara
Follow us
Basha Shek

|

Updated on: Oct 23, 2022 | 12:54 PM

కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం కాంతార. కన్నడిగుల సంప్రదాయామైన భూత కోల ఆచారం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. మొదట కన్నడ నాట చిన్న సినిమాగా విడుదలైన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలో హిట్‌ అయ్యింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ్‌, హిందీలో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అలాగే పలువురు ప్రముఖులు ఈ సినిమాను వీక్షించి అద్భుతమంటూ కొనియాడుతున్నారు. స్వీటీ అనుష్క, కోలీవుడ్ స్టార్‌ ధనుష్‌, ప్రభాస్‌ లాంటి సెలబ్రిటీలు కాంతారా సినిమా సూపర్బ్‌ అంటూ తమ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్‌ చేసుకున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఈ సినిమాను వీక్షించింది. అనంతరం సోషల్‌ మీడియా వేదికగా తన అనుభవాలను పంచుకుంది. ‘ఇప్పుడే ఫ్యామిలీతో కలిసి కాంతార సినిమా చూశాను. ఇప్పటికీ నా శరీరం ఇంకా వణుకుతూనే ఉంది. ఇదొక అద్భుతమైన అనుభవం. సాంప్రదాయం, జానపద కథలు, దేశీయ సమస్యల సమ్మేళనమే ఈ చిత్రం. రిషబ్‌ శెట్టికి హ్యాట్సాఫ్‌. రచన, దర్శకత్వం, నటన.. అన్నీ నెక్ట్స్‌ లెవెల్లో ఉన్నాయి. సినిమాలో ప్రకృతి అందాలను చూపించిన విధానం, యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంది’

మరో వారం రోజుల పాటు ఇదే ట్రాన్స్‌లో..

‘సినిమా అంటే ఇది. ఇలాంటి చిత్రాన్ని తామెప్పుడూ చూడలేదని థియేటర్‌లో ప్రేక్షకులు చెబుతున్నారు. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన టీమ్‌కు ధన్యవాదాలు. మరోవారం రోజులపాటు నేను ఈ అనుభూతిలోనే ఉంటాననిపిస్తుంది’ అని రాసుకొచ్చింది. అలాగే మరో పోస్ట్‌ షేర్‌ చేస్తూ ‘వచ్చే ఏడాది కాంతార ఆస్కార్‌ నామినేట్‌ అవ్వడం పక్కా. భవిష్యత్‌లో ఇంతకంటే గొప్ప చిత్రాలు రావోచ్చు కానీ, మన దేశ సంస్కృతిని, అద్భుతాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసే ఇలాంటి చిత్రాలను ఆస్కార్‌కు నామినేట్‌ చేయాల్సిన అవసరం ఉంది’ అని కంగనా తెలిపింది.

ఇవి కూడా చదవండి

కాగా సెప్టెంబర్‌ 30న కన్నడలో విడుదలైన కాంతారా రూ.200 కోట్లవైపు దూసుకెళుతోంది. తెలుగు, హిందీ, తమిళ్‌ భాషల్లోనూ వసూళ్ల వర్షం కురుస్తోంది. కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ నిర్మించిన హోంబలే ఫిల్మ్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ నటించింది. కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే