Rishab Shetty : ప్రేక్షకులకు కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి విన్నపం.. దయచేసి ఆ శబ్దాన్ని అనుకరించవద్దంటూ..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాంతార సత్తా చాటుతోంది. ప్రాంతీయ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యధిక వసూల్లు రాబడుతూ రికార్డ్ సృష్టిస్తోంది. అయితే కాంతార సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు హీరో రిషబ్ శెట్టి ప్రత్యేక విన్నపం చేశారు.

Rishab Shetty : ప్రేక్షకులకు కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి విన్నపం.. దయచేసి ఆ శబ్దాన్ని అనుకరించవద్దంటూ..
Rishab Shetty
Follow us

|

Updated on: Oct 21, 2022 | 3:12 PM

దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కాంతార హవా కొనసాగుతుంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వియ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాకు ఊహించని స్థాయిలో ఆదరణ లభిస్తుంది. సౌత్ టూ నార్త్ సినీ విమర్శకుల ప్రశంసలు అందుకంటూ దూసుకుపోతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా మొదలై.. భారీ విజయాన్ని అందుకుంది. కర్ణాటక తుళునాడులోని కోలా, కంబా సంప్రదాయ ఆచారాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీతో భూతకోల సంస్కృతిని తెలియజేశారు. ముఖ్యంగా కాంతార క్లైమాక్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. దైవం ఆవహించిన సమయంలో రిషబ్ శెట్టి నటన ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది.

అయితే దేవుడు ఆవహించిన సమయంలో కోల ఆడే వ్యక్తులు ఓ.. అంటూ వింత శబ్దాన్ని చేస్తారని ఆ సినిమాలో చూపించారు. ఆ ధ్వని వినిపించిన ప్రతిసారీ థియేటర్లు దద్దరిల్లిపోయేలా ప్రేక్షకులు రియాక్ట్ అవుతున్నారు. అంతేకాదు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఓ.. అంటూ కేకలు వేస్తూ.. సినిమాపై తమ అభిమానాన్ని బయటపెడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై హీరో రిషబ్ శెట్టి స్పందించారు.

ఓ.. అనేది కేవలం శబ్దం మాత్రమే కాదని.. అది తమకు ఓ సెంటిమెంట్ అని అన్నారు. కాంతార వీక్షించిన ప్రేక్షకులందరికీ నా చిరు విన్నపం. సినిమాలో ఉపయోగించిన శబ్దాలను అనుకరించవద్దు. ఇదొక ఆచారం. ఆధ్యాత్మిక నమ్మంక. అలాగే ఇది చాలా సున్నితమైన అంశం. దీనివల్ల ఆచారం దెబ్బతినొచ్చు అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..
40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం