AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Thalapathy: మరో తెలుగు ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్.. సక్సెస్‏ఫుల్ డైరెక్టర్‏తో దళపతి సినిమా..

ప్రస్తుతం వరిసు చిత్రీకరణలో బిజీగా ఉన్న విజయ్ దళపతి.. మరో తెలుగు ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. దీంతో విజయ్ తదుపరి సినిమా డైరెక్టర్ ఎవరనేది ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది.

Vijay Thalapathy: మరో తెలుగు ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్.. సక్సెస్‏ఫుల్ డైరెక్టర్‏తో దళపతి సినిమా..
Vijay Thalapathy
Rajitha Chanti
|

Updated on: Oct 21, 2022 | 3:31 PM

Share

తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతికి తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఆయన నటించిన చిత్రాలు తెలుగు విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ హీరో వరిసు సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మూవీపై అంచనాలు పెంచాయి.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా తర్వాత విజయ్.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా దళపతి కెరీర్‏లో 67వ చిత్రంగా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమానే కాకుండా తాజాగా విజయ్ తెలుగులో మరో ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం వరిసు సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న దళపతితో మరో సినిమా నిర్మిస్తేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ కసరత్తులు చేస్తుందట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి విజయ్ ను సంప్రదించగా.. అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

ఇవి కూడా చదవండి

దీంతో విజయ్ తదుపరి తెలుగు సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ డైరెక్టర్ ఎవరనే విషయంపై నెట్టింట చర్చ జరుగుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాను డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించనున్నారట. ఇటీవ మైత్రీ మూవీస్ మేకర్స్ అట్లీని సంప్రదించినట్లుగా టాక్. వీరిద్దరి కాంబోలో వచ్చిన తెరీ, మెర్సల్ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో.. మరోసారి హిట్ కాంబో రిపీట్ కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం అట్లీ .. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో జవాన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నయన్ కథానాయికగా నటిస్తోంది. అయితే విజయ్ తదుపరి తెలుగు సినిమా అప్డేట్ రావాల్సి ఉంది.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..