AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Shourya: సెలబ్రిటీలను తాకిన గ్యాస్ సిలిండర్ల కొరత.. నాగ శౌర్య తల్లి వంటలు ఎలా చేస్తుందో చూశారా? వీడియో

'ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చింది' అన్నట్లు ఇరాన్- అమెరికా- ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ఇండియాకు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఇంధన సరఫరా పూర్తిగా ఆగిపోవడంతో దేశంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల కొరతతో వ్యాపార రంగం కుదేలవుతోంది.

Naga Shourya: సెలబ్రిటీలను తాకిన గ్యాస్ సిలిండర్ల కొరత.. నాగ శౌర్య తల్లి వంటలు ఎలా చేస్తుందో చూశారా? వీడియో
Actor Naga Shaurya Family
Basha Shek
|

Updated on: Mar 16, 2026 | 7:57 AM

Share

ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నెలకొన్న నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఇంధన సరఫరా ఆగిపోయింది . దీని కారణంగా ఇండియాలో తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటికే హైదరాబాద్, ముంబై, బెంగళూరు తదితర ప్రధాన నగరాల్లోని హోటల్స్, రెస్టారెంట్స్ మూత పడ్డాయి. ముఖ్యంగా హైదరాబాదులో కూడా గ్యాస్ కొరత కారణంగా హోటల్స్, రెస్టారెంట్ యజమానులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సిలిండర్లు లేక చాలా మంది తమ హోటల్స్ ను మూసి వేస్తుండగా మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అంటే కట్టెల పొయ్యిల పైనే వంటలు కానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్ హీరో నాగ శౌర్య తల్లి గ్యాస్ సిలిండర్ల కొరతపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేశారామె. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా ‘ ఉషా ముల్పూరి కిచెన్ ’ పేరుతో హైదరాబాద్ లో రెస్టారెంట్ బిజినెస్ నిర్వహిస్తున్నారు నాగ శౌర్య తల్లి. ఓ వైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తోన్న ఆమె తన రుచికరమైన వంటకాలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రా వంటకాలకు ‘ ఉషా ముల్పూరి కిచెన్’ బాగా ఫేమస్. అయితే ప్రస్తుతం నగరంలో ఉన్న గ్యాస్ కొరత కారణంగా వంటలను కట్టెల పొయ్యిపై చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఉషా ముల్పూరి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

“వంట గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో మేము కట్టెల పొయ్యిపై వంట చేయాల్సి వస్తోంది. ఉదయం ఆరు గంటల నుంచే మా సిబ్బంది పని మొదలుపెడుతున్నారు. అయితే ఒకవైపు ఎండ, మరోవైపు పొగ ఉండటంతో ఇలా వంటలు చేయడం చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ మా వద్దకు వచ్చే కస్టమర్లను వెనక్కు పంపించకూడదనే ఉద్దేశంతో వంటలు ఆపకుండా కొనసాగిస్తున్నాం. గ్యాస్ సమస్య ఉన్నప్పటికీ కొన్ని వంటకాలను ప్రతిరోజూ అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం. మా రెస్టారెంట్‌కు వచ్చే అతిథులు ఆకలితో వెనుదిరగకూడదనే ఉద్దేశంతోనే ఇలా కష్టపడుతున్నాం. కట్టెల పొయ్యిపై వండిన వంటకాలు మరింత రుచిగా ఉంటాయి’ అని ఉషా మల్పూరి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us