Kajal Aggarwal: కుమారుడిని చూసి మురిసిపోతున్న కాజల్.. ప్రతి విషయం గుర్తుపెట్టుకుంటాను అంటూ ఎమోషనల్ పోస్ట్..

కాజల్ తన కుమారుడు నీల్ పుట్టి 6 నెలలు పూర్తయిన సందర్బంగా తన ఇన్ స్టా ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ రాసింది. తన కొడుకు అందమైన ఫోటో షేర్ చేస్తూ.. అతడికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది.

Kajal Aggarwal: కుమారుడిని చూసి మురిసిపోతున్న కాజల్.. ప్రతి విషయం గుర్తుపెట్టుకుంటాను అంటూ ఎమోషనల్ పోస్ట్..
Kajal
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 20, 2022 | 2:56 PM

చాలా కాలం తర్వాత టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ రీఎంట్రీ ఇస్తుంది. డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబోలో రాబోతున్న ఇండియన్ 2 సినిమాతో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. తన కొడుకుతోపాటు షూటింగ్స్‏లో పాల్గొంటుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. తన ఫ్యామిలీ విషయాలు. సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా.. తన కొడుకుకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది ఆమె కుమారుడు నీల్ పుట్టి 6 నెలలు పూర్తయిన సందర్బంగా కాజల్ తన ఇన్ స్టా ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ రాసింది. తన కొడుకు అందమైన ఫోటో షేర్ చేస్తూ.. అతడికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది.

“నువ్వు పుట్టి అప్పుడే 6 నెలలు పూర్తయ్యింది. కాలం ఎంతో తొందరంగా గడిచిపోయింది. ఒక యంగ్ మదర్ గా నీ విషయంలో నేను ముందు భయపడ్డాను. ఒక తల్లిగా నా కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తించగలనా లేదా అనుకున్నాను. ఇప్పటికీ గొప్ప తల్లిని ఎలా అవ్వాలో నెర్చుకుంటూనే ఉన్నాను. నాకు ఎన్ని పనులు ఉన్నా.. నీ కోసం నా సమయాన్ని ఎప్పుడూ కేటాయిస్తూనే ఉంటాను.. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. నీపై శ్రద్ద చూపడంలో నేను ఎక్కడా రాజీపడను. ఇది నాకు సవాలుతో కూడుకున్నదే అయినా.. నేను పొందే ఆనందం ముందు ఆ సవాలు చిన్నదే అనిపిస్తుంది. నువ్వు రాత్రిపూట చేసే అల్లరి నాకు సంతోషాన్ని ఇస్తుంది. నీ గురించి మీ నాన్న నేను సరదాగా మాట్లాడుకుంటాము. నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను.

నీకు జన్మనిచ్చే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. తల్లిగా చేసే బాధ్యత గొప్పదని అంటారు. నువ్వు పుట్టి ఏడాది కావడానికి ఇంకా సగం దూరం ఉంది. మై లవ్..మై నీల్.. ” అని రాసుకొచ్చింది కాజల్. ప్రస్తుం ఆమె షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ప్రస్తుతం కాజల్.. ఇండియన్ 2 చిత్రంలో నటిస్తుంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న వీడియోను కూడా షేర్ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే