Kantara: ‘వరాహరూపం.. దైవ వరిష్ఠం’.. కాంతార క్లైమాక్స్ సాంగ్ చూస్తే గూస్‏బంప్సే..

బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టిస్తోన్న కాంతార సినిమా నుంచి తాజాగా వరహరూపం.. దైవ వరిష్టం సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. క్లైమాక్స్ సాంగ్ ఎలా తీశారో చెబుతూ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

Kantara: 'వరాహరూపం.. దైవ వరిష్ఠం'.. కాంతార క్లైమాక్స్ సాంగ్ చూస్తే గూస్‏బంప్సే..
Kantara
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 20, 2022 | 3:47 PM

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న చిత్రం కాంతార. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళంలోనూ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందంటూ రివ్యూస్ ఇస్తున్నారు. చివరగా దైవం ఆవహించిన సన్నివేశాల్లో రిషబ్ శెట్టి నటన ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా వరహరూపం.. దైవ వరిష్టం సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. క్లైమాక్స్ సాంగ్ ఎలా తీశారో చెబుతూ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. అందులో సంప్రదాయ వాయిద్యాలతో సంగీత దర్శకుడు అజనీశ్ లోకనాథ్ స్వరాలు సమకూర్చడంతో మొదలైన పాట ఆద్యంతం అలరించేలా తీర్చిదిద్దారు. ఆ పాటను దర్శకుడు.. నటుడు రిషబ్ తెరకెక్కిస్తున్న సన్నివేశాలు.. ఆ పాత్రలలో మిగతా నటులు కనిపించిన తీరు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా దైవ ఆవహించిన పాత్రలో రిషబ్ కనిపించిన తీరు..నటన ప్రేక్షకులకు గూస్‏బంప్స్ తెప్పిస్తున్నాయి.

ఈ పాటకు షాషిరాజ్ కపూర్ సాహిత్యం అందించగా.. సాయి విఘ్నేష్ ఆలపించారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ పూర్తిచేయడానికి ఐదు రోజుల సమయం తీసుకున్నారు. వరుసగా చిత్రీకరణ జరపటం వలన ఒళ్లు హూనమైన దైవ ఆవహించిన సన్నివేశాల్లో ఆ అలసట ఏమాత్రం కనిపించనీయకుండా నటించిన విధానం మెప్పిస్తోంది. హోంబాలే ఫిల్మ్స్ ఇచ్చిన బడ్జెట్‏లో సినిమాను పూర్తిచేసేందుకు ఎంతో నిబద్ధతంతో పనిచేశారు. అందుకు నిదర్శనమే కాంతార క్లైమాక్స్. ఆ సన్నివేశాలను తెరకెక్కించే సమయంలో ఉపవాసం చేశారు. కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగి షూటింగ్ చేసేవారట. క్లైమాక్స్ షూటింగ్ అదనపు బాధ్యతలను రాజ్ బి శెట్టి చూసుకున్నారు.

కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ నిర్మించిన హోంబలే ఫిల్మ్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ నటించింది. ఇందులో కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తదితరులు కీలకపాత్రలలో నటించారు. అక్టోబర్ 15న తెలుగులో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.