Manchu Vishnu: సినిమా రిలీజ్ కాకుండానే రివ్యూలు.. పబ్లిక్ టాక్‏లు.. ఛానల్ పేర్లతో సహా బయటపెట్టిన మంచు విష్ణు..

పలు యూట్యూబ్ ఛానల్స్ పై హీరో మంచు విష్ణు ఫైర్ అయ్యారు. జిన్నా సినిమా విడుదల కాకుండానే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఛానల్స్ పేర్లతోపాటు యూఆర్ఎల్స్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. వాటిని త్వరలోనే మూసివేయిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.

Manchu Vishnu: సినిమా రిలీజ్ కాకుండానే రివ్యూలు.. పబ్లిక్ టాక్‏లు.. ఛానల్ పేర్లతో సహా బయటపెట్టిన మంచు విష్ణు..
Manchu Vishnu
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 20, 2022 | 4:16 PM

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటేస్ట్ చిత్రం జిన్నా. ఇప్పటికే అన్నికార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఓవైపు జిన్నా టీం ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉండగా.. మరోవైపు నెట్టింట పలు యూట్యూబ్ ఛానల్స్ ఈ మూవీ రివ్యూస్.. పబ్లిక్ టాక్స్ ఇచ్చేశాయి. అలాంటి కొన్ని ఛానల్లను గుర్తించిన మంచు విష్ణు.. వాటి యూఆర్ఎల్స్.. వాటి పేర్లను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే వాటిని మూసేయిస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. “అనుకున్నట్లుగానే జరుగుతుంది. ఇదిగో ‘పెయిడ్ బ్యాచ్’ని మీ ముందుకు తీసుకువచ్చాను. జిన్నా సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ వీళ్లు ఇప్పుడే నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం ప్రారంభించారు. ఎందుకు అంత ద్వేషం???? . మేము త్వరలో వారి ఛానెల్‌లను మూసివేస్తామని వారు గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను” అంటూ విష్ణు ట్వీట్ చేశారు.

ఈ సినిమాకు డైరెక్టర్ ఈశాన్ సూర్య దర్శకత్వం వహించగా..పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోనీ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా.. అవ్ రామ్ భక్త మంచు సమర్పణలో అవా ఎంటర్టైన్మెంట్.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించారు. తెలుగులోనే కాకుండా ఈ సినిమా హిందీ, తమిళం, మలయాళ భాషలలో రేపు విడుదల కానుంది.

ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ.. తాను యాక్షన్ కామెడీ జోనర్లో చేసిన సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయని.. ఆ తర్వాత వేరే జోనర్స్ లోకి వెళ్లడం పొరపాటు అయ్యిందని.. మళ్లీ ఇప్పుడు యాక్షన్ కామెడీ వైపు వచ్చినట్లు తెలిపారు. జిన్నా సినిమా తప్పకుండా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుందని..యాక్షన్..కామెడీ.. రొమాన్స్‏తోపాటు మరో కోణం కూడా ఈ కథలో ఉందని.. అది హారర్ నా.. థ్రిల్లరా ? అనేది సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే చెప్పాలని అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే