Sai Pallavi: సాయి పల్లవి ఫిట్‌గా ఉండడానికి జిమ్ కారణం కాదంటా.. ఈ బ్యూటీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటంటే..
అందం, అభినయం కలగలిపిన అతికొద్ది మంది హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. డాక్టర్ చదివి యాక్టర్ అయిన ఈ అందాల తార అనతి కాలంలోనే టాప్ హీరోయిన్‌ల జాబితాలో చేరింది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో..
అందం, అభినయం కలగలిపిన అతికొద్ది మంది హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. డాక్టర్ చదివి యాక్టర్ అయిన ఈ అందాల తార అనతి కాలంలోనే టాప్ హీరోయిన్‌ల జాబితాలో చేరింది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో వరుస ఆఫర్లకు దక్కించుకుంటూ దూసుకుపోతోందీ బ్యూటీ. ఇక నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి మేకప్‌కు దూరంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సాయి పల్లవి నటించిన ఏ చిత్రంలోనూ గ్లామర్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించకపోవడం విశేషం. అంతేకాకుండా ఫిజిక్ విషయంలోనూ సాయి పల్లవి ఎప్పుడూ ఒకేలా ఉండేలా మెయింటెన్ చేస్తోంది.
అయితే చాలా మంది హీరోయిన్లు తమ ఫిజిక్‌ను కాపాడుకోవడానికి ఎక్కువగా జిమ్‌ల బాట పడుతుంటారు. నిత్యం వర్కవుట్స్ చేస్తుంటారు. అయితే తాను మాత్రం వాటికి దూరం అంటోంది సాయిపల్లవి. జిమ్, డైట్ అసలు ఫాలో కానని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. మెడిసిన్ చదివిన తనకు మొదటి నుంచి బాడీ మీద కంట్రోల్ ఉందని, ఏం తిన్నా.. ఎంత తిన్నా.. బాడీని కరెక్ట్ ఫిజిక్‌లో పెట్టుకోవడానికి.. హెల్తీగా ఉండటానికి చక్కగా ఇంటి పనులు చేసుకుంటానని తెలిపింది. ఇక బ్రేక్ ఫాస్ట్‌లో రాగి జావా, రెండు ఇడ్లీలు.. మధ్యాహ్నం భోజనంలో రసం అన్నం, ఒక వెజిటేబుల్స్ ఫ్రై.. ఈవినింగ్ రెండు చపాతీలు.. అంటూ తన డైట్ ప్లాన్‌ను చెప్పుకొచ్చింది.
ఇక సాయి పల్లవి సినిమా విషయానికొస్తే ఈ ఏడాది నటించిన విరాటపర్వం, గార్గి చిత్రాలతో నటిగా మరో మెట్టుపైకెక్కింది. రెండు చిత్రాల్లోనూ నటనకు అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి మెప్పించింది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత సాయిపల్లవి మరో చిత్రానికి సైన్ చేయలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..