AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Ghost: ఓటీటీలో సందడి చేయనున్న నాగార్జున.. ‘ది ఘోస్ట్’ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

అక్కినేని నాగార్జున ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనున్నారు. ఏంటీ ? ఏదైనా టాక్ షో.. లేదా వెబ్ సిరీస్ చేస్తున్నారా అని సందేహిస్తున్నారా ? అవేం కాదండి.. ఆయన నటించిన ది ఘోస్ట్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.. మరీ ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందామా.

The Ghost: ఓటీటీలో సందడి చేయనున్న నాగార్జున.. 'ది ఘోస్ట్' స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..
The Ghost Ott
Rajitha Chanti
|

Updated on: Oct 21, 2022 | 9:05 PM

Share

కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ది ఘోస్ట్. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కేవలం యాక్షన్ లవర్స్‏ను మాత్రమే ఆకట్టుకోగలిగింది. ఇందులో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా నవంబర్ 2 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందట. గతంలో నాగార్జున నటించిన వైల్జ్ డాగ్ చిత్రం థియేటర్లలో మెప్పించలేకపోయినా.. ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ది ఘోస్ట్ కూడా ఓటీటీలో అలరించనుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో విక్రమ్ అనే ఇంటర్ పోల్ అధికారిగా కనిపించారు నాగ్. అతనితో ఉండే ప్రియ అనే అమ్మాయిగా సోనాల్ కనిపించింది. వీరిద్దరు దుబాయ్ లో పనిచేస్తుంటారు. అదే సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే ఒక ఆపరేషన్ లో పాల్గొన్నప్పుడు జరిగిన సంఘటనలో రౌడీ మూక చేతుల్లో చిన్న పిల్లాడు చనిపోతాడు. ఆ సంఘటన విక్రమ్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మానసికంగా ఎంతో కుంగిపోతాడు. ఆ తర్వాత ప్రియ కూడా అతనికి దూరమవుతుంది.

అయితే అదే సమయంలో అను (గుల్ పనాగ్ ) నుంచి విక్రమ్ కు ఫోన్ వస్తుంది. తననీ.. తన కూతురు అదితిని కాపాడమని కోరుకుంటుంది. దాంతో ఊటీకి బయల్దేరతాడు. ఆ తర్వాత విక్రమ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు.. అనును.. ఆమె కుటుంబాన్ని కాపాడాడు అనేది ది ఘోస్ట్. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ద్వారా సినీ ప్రియులకు మరింత అందుబాటులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..