OTT Movies : సినీ లవర్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. దీపాల పండక్కి ఓటీటీలో సందడి చేస్తున్న సినిమాలు ఇవే..

సినిమా రిలీజ్ అయిన ఎనిమిది వారల తర్వాత థియేటర్స్ లోకి రావాలని ఇప్పటికే నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. అయినా కూడా కొన్ని సినిమాలు ముందుగానే ఓటీటీ బాటపడుతూనే ఉన్నాయి.

OTT Movies : సినీ లవర్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. దీపాల పండక్కి ఓటీటీలో సందడి చేస్తున్న సినిమాలు ఇవే..
Ott
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 21, 2022 | 7:34 AM

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత జనాలు థియేటర్స్ కు రావడం లేదు అనే టాపిక్ తో ఇప్పటికే చాలా మంది చాలాసార్లు చర్చలు పెట్టారు. సినిమా రిలీజ్ అయిన ఎనిమిది వారల తర్వాత థియేటర్స్ లోకి రావాలని ఇప్పటికే నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. అయినా కూడా కొన్ని సినిమాలు ముందుగానే ఓటీటీ బాటపడుతూనే ఉన్నాయి. అయితే మంచి సినిమాలకు మాత్రం థియేటర్స్ లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన సీతరామమం, బింబిసార, గాడ్ ఫాదర్, కాంతార సినిమాలు భారీ హిట్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక దీపావళి పండగ పురస్కరించుకొని థియేటర్స్ లోనే కాదు ఓటీటీ రిలీజ్ లు వెల్లువెత్తాయి. నిన్న ఈరోజు కలిపి ఏకంగా 15 సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలు ఏంటంటే..

శర్వానంద్, రీతువర్మ జంటగా నటించిన సినిమా ఒకే ఒక జీవితం. ఈ సినిమాకు శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించారు.  తెలుగు, తమిళ భాషల్లో..ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నటించి బింబిసార ఈరోజు జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. చారుకేష్ శేఖర్ డైరెక్ట్ చేసిన అమ్ము మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ, బాబీ సింహ, నవీన్ చంద్రన ఈ సినిమాలో నటించారు.

ద పెరి ఫెరల్ మూవీ అక్టోబర్ 21 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ‘ఫోర్ మోర్ షాట్స్’ (అమెజాన్ ప్రైమ్)అక్టోబర్ 21 నుండి ఈ హిందీ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ద స్కూల్ ఫర్ గుడ్ అండ్ ఈవిల్( నెట్ ఫ్లిక్స్), బార్బేరియన్స్  (నెట్ ఫ్లిక్స్), ‘ఫ్రమ్ స్క్రాచ్’ (నెట్ ఫ్లిక్స్ ) , కపట నాటక సూత్రధారి (ఆహా ), కవి సామ్రాట్ (ఆహా) ఎల్ బి శ్రీరామ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ అక్టోబర్ 22 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. పెట్టై కాలి’ (నెట్ ఫ్లిక్స్),ట్రిప్లింగ్ (నెట్ ఫ్లిక్స్) , లైగర్(హిందీ) అక్టోబర్ 21 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది, కృష్ణ వ్రింద విహారి(నెట్ ఫ్లిక్స్), స్వాతి ముత్యం (ఆహా) బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ నటించిన ఈ మూవీ అక్టోబర్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.