AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bimbisara OTT Release: బింబిసారుడు ఓటీటీలోకి వచ్చేశాడోచ్‌.. కల్యాణ్‌రామ్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

ఈ సినిమాతో దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్యాణ్‌ రామ్‌ సాలిడ్‌ హిట్‌ అందుకున్నాడు. బింబిసారుడిగా, దేవదత్తుడిగా డబుల్‌ రోల్‌లో కల్యాణ్‌ రామ్‌ అభినయం అదిరిపోయిందన్న ప్రశంసలు వచ్చాయి.

Bimbisara OTT Release: బింబిసారుడు ఓటీటీలోకి వచ్చేశాడోచ్‌.. కల్యాణ్‌రామ్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
Bimbisara Movie
Basha Shek
|

Updated on: Oct 21, 2022 | 7:01 AM

Share

నందమూరి కల్యాణ్‌ రామ్‌ నటించిన సూపర్‌హిట్‌ సినిమా బింబిసార. ఆగస్ట్‌ 5న రిలీజైన ఈ సినిమా ఎంత పెద్ద హిట్టైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బింబిసారుని జీవిత కథను ఆధారంగా చేసుకుని సోషియో ఫాంట‌సీ డ్రామా నేపథ్యంలో డెబ్యూ డైరెక్టర్‌ వశిష్ఠ్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై కె. హరికృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్యాణ్‌ రామ్‌ సాలిడ్‌ హిట్‌ అందుకున్నాడు. బింబిసారుడిగా, దేవదత్తుడిగా డబుల్‌ రోల్‌లో కల్యాణ్‌ రామ్‌ అభినయం అదిరిపోయిందన్న ప్రశంసలు వచ్చాయి. బాక్సాఫీస్ వ‌ద్ద నిర్మాత‌ల‌కు కాసుల పంట పండించిందీ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌. థియేటర్లలో రచ్చ రచ్చ చేసిన బింబిసారుడు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేశాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో అక్టోబర్‌21 (శుక్రవారం) అర్ధరాత్రి నుంచే బింబిసార స్ట్రీమింగ్‌ అవుతోంది.

బింబిసార‌ చిత్రంలో కేథ‌రిన్ ట్రెసా, సంయుక్తా మీన‌న్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, ప్ర‌కాశ్ రాజ్‌, వెన్నెల కిశోర్‌ కీల‌క పాత్ర‌లు పోషించారు. కీరవాణి సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. క్రీస్తు పూర్వం 500 సంవత్సరానికి చెందిన త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడు మాయదర్పణం కారణంగా వర్తమానంలోకి వస్తాడు. ఈక్రమంలో బింబిసారుడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ?.. విధి అతనికి ఎలాంటి పాఠాలు నేర్పింది ? ఆ కాలంలో ఆయన దాచిన నిది తలుపులు తెరవడం కోసం ఈ కాలంలో సుబ్రహ్మణ్యశాస్త్రి ఎందుకు ప్రయత్నిస్తుంటాడు ? బింబిసారుడు తిరిగి తన కాలానికి ఎలా వెళ్లాడు ? అనేది స్టోరీ. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్‌, మలయాళం భాషల్లో ఈ సినిమా ప్రసారమవుతోంది. మరి థియేటర్లలో బింబిసారుడి దర్పాన్ని చూడలేని వారు ఎంచెక్కా ఇంట్లోనే చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
లాంగ్ డ్రైవ్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.583 కోట్లు చెల్లించిన బ్యాంక్‌! ఎందుకంటే
సూర్యరశ్మి కాదు.. ఈ ఆహారాలతోనూ విటమిన్-D! ‘సన్‌షైన్’ డైట్ ప్లాన్
సూర్యరశ్మి కాదు.. ఈ ఆహారాలతోనూ విటమిన్-D! ‘సన్‌షైన్’ డైట్ ప్లాన్