Prince Review: ప్రిన్స్‌ రివ్యూ.. మరోసారి జాతిరత్నాలు డైరెక్టర్ ప్రేక్షకులను మెప్పించినట్లేనా ?

ప్రిన్స్‌పై తెలుగులోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. శివకార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో ఇండో బ్రిటీష్‌ ప్రేమకథను చూపించాడు దర్శకుడు అనుదీప్. మరి ఇది ఎంతవరకు ఆకట్టుకుంది.. ఈ లవ్ స్టోరీ మన ఆడియన్స్‌కు కిక్ ఇస్తుందా..?

Prince Review: ప్రిన్స్‌ రివ్యూ.. మరోసారి జాతిరత్నాలు డైరెక్టర్ ప్రేక్షకులను మెప్పించినట్లేనా ?
Prince Movie
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajitha Chanti

Updated on: Oct 21, 2022 | 4:08 PM

‘జాతి రత్నాలు’ అనే ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో ట్రెండింగ్ అయిపోయిన దర్శకుడు అనుదీప్ కేవీ. ఈయన నుంచి వచ్చిన సినిమా కావడంతో ప్రిన్స్‌పై తెలుగులోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. శివకార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో ఇండో బ్రిటీష్‌ ప్రేమకథను చూపించాడు దర్శకుడు అనుదీప్. మరి ఇది ఎంతవరకు ఆకట్టుకుంది.. ఈ లవ్ స్టోరీ మన ఆడియన్స్‌కు కిక్ ఇస్తుందా..?

రివ్యూ: ప్రిన్స్‌

నటీనటులు: శివ కార్తికేయన్‌, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్‌, ప్రేమ్‌గీ అమరన్‌, సతీష్‌ కృష్ణన్‌, ఆనంద్‌ రాజ్‌ తదితరులు

ఇవి కూడా చదవండి

ఎడిటర్‌: ప్రవీణ్‌ కేఎల్‌

సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస

సంగీతం: ఎస్ఎస్‌ థమన్‌

నిర్మాతలు: సునీల్‌ నారంగ్‌, పూస్కుర్‌ రామ్మోహన్‌ రావు, డి. సురేష్‌ బాబు

రచన, దర్శకత్వం: అనుదీప్‌ కేవి

కథ:

పాండిచ్చేరిలో ఓ స్కూల్‌ టీచర్‌ ఆనంద్‌ (శివ కార్తికేయన్‌). పేరుకు స్కూల్ టీచర్ అయినా కూడా చిన్న పిల్లాడి మనస్తత్వం అతడిది. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఆయనే.. స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్తుంటాడు. ఆనంద్ తండ్రి వీరతిలకం విశ్వనాథం (సత్యరాజ్‌) ఆ ఊళ్లోనే పేరున్న వ్యక్తి. పొగడ్తలకు ఈజీగా పడిపోతాడు. అమాయకుడైన విశ్వనాథంకు అంతకంటే అమాయకుడైన కొడుకు ఆనంద్‌. అలా సాగుతున్న వీళ్ళ జీవితంలోకి జెస్సీక (మరియా ర్యాబోషప్క) వస్తుంది. ఆమె స్కూల్ టీచర్‌గా జాయిన్ కావడంతో.. తొలి చూపులోనే ప్రేమలో పడతాడు ఆనంద్. తన ప్రేమను చెప్పిన తర్వాత ఇరు కుటుంబాల్లోనూ గొడవలు వస్తాయి. అదే సమయంలో జెస్సికా తండ్రి విలియమ్స్‌ బిజినెస్‌లో నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటాడు. దాంతో ఇండియాలో ఉన్న తన ఆస్తులను అమ్ముకుని బ్రిటన్‌కు వెళ్దామని డిసైడ్ అవుతాడు. కానీ ఆ స్థలాన్ని ఇక్కడ భూపతి (ప్రేమ్ జీ అమరన్) కబ్జా చేస్తాడు. దాన్ని విడిపించేందుకు ఆనంద్ ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే ఇండియాను అవమానిస్తున్నావంటూ తండ్రి విశ్వనాథం.. కొడుకు ఆనంద్‌కు వ్యతిరేకంగా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది.. ఇండో బ్రిటీష్ కథ ఎలా ముగిసింది అనేది కథ..

కథనం:

కంటెంట్ లేకుండా కామెడీ చేయడం అంటే చిన్న విషయం కాదు. దానికి చాలా టాలెంట్ ఉండాలి. బహుశా అనుదీప్ కు అది చాలా ఉన్నట్టుంది. ఎలాంటి కథ లేకుండా జాతి రత్నాలులో ఫుల్లుగా నవ్వించాడు ఈ దర్శకుడు. ప్రిన్స్ లో కూడా ఆరెంజ్ నవ్వులు లేకపోయినా.. దాదాపు ఇదే చేశాడు. ఈయన సినిమాల్లో ఉండే అతి పెద్ద ప్లస్ పాయింట్.. అన్ని కారెక్టర్స్ చాలా అమాయకంగా ఉండటమే కాకుండా అంతే ఫన్నీగానూ బిహేవ్ చేయడం. అదే కావాల్సినంత ఫన్ క్రియేట్ చేస్తుంది. జాతి రత్నాలులో అదే జరిగింది. ఇక్కడ ప్రిన్స్‌లోనూ ఇదే చేసాడు అనుదీప్. ఫస్టాఫ్ అక్కడక్కడ బాగుంటుంది. కానీ సెకండాఫ్ మాత్రం తన ట్రేడ్ మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు అనుదీప్. ముఖ్యంగా డైలాగ్స్ అయితే భలే ఉంటాయి. అసలు సంబంధమే లేకుండా మాట్లాడుతూ సత్యదేవ్, శివకార్తికేయన్‌తో చేయించిన కామెడీ బాగానే వర్కవుట్ అయింది. చెప్పుకోవడానికి సీరియస్ కథలా ఉంటుంది.. కానీ దాన్ని కూడా ఎంటర్టైన్మెంట్ పద్ధతిలోనే డీల్ చేశాడు అనుదీప్. ఏం చేసినా ఏం రాసినా అంతా నవ్వించడం కోసమే అన్నట్టు ఉంటుంది ప్రిన్స్. లాజిక్ ల కోసం వెతుక్కోకుండా కామెడీ ఎంజాయ్ చేస్తే ఈ సినిమా నచ్చుతుంది. శివ కార్తికేయన్, మరియా లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోదు. కాకపోతే ఆమెను ఇంప్రెస్ చేయడానికి శివ చేసే పనులు కామెడీగా ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఫన్నీగా ఉంటుంది. సెకండాఫ్ అయితే ఎక్కడా బోర్ కొట్టకుండానే బాగానే లాక్కొచ్చాడు దర్శకుడు. క్లైమాక్స్ హిలేరియస్‌గా రాసుకున్నాడు. బోర్డర్.. ఈ మాట ఫస్ట్ టైమ్ నేనెప్పుడు విన్నానంటే అంటూ శివకార్తికేయన్ చెప్పిన డైలాగ్ కేక పెట్టిస్తుంది. అలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి సినిమాలో. లాజిక్ కోసం చూసుకోకుండా ఉంటేనే ప్రిన్స్ ఎక్కుతుంది. డబ్బింగ్ సినిమా కావడం దీనికి మరో మైనస్.

నటీనటులు:

శివ కార్తికేయన్ అదిరిపోయే కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. డాన్సులు, ఫైట్స్ కూడా బాగానే చేసాడు. ఎమోషన్ చూపించడానికి ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలే లేవు. సత్యరాజ్‌లో ఇంత కామెడీ ఉందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కట్టప్ప లాంటి కారెక్టర్ చేసిన నటుడుతో కడుపుబ్బా నవ్వించే పాత్ర చేయించాడు అనుదీప్. ప్రేమ్ జి అమరన్, మరియా క్యారెక్టర్స్ బాగున్నాయి. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

థమన్ సంగీతం పర్లేదు. పాటలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా జెస్సికా సాంగ్ అయితే అదిరిపోయింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఎడిటింగ్ ఫస్టాఫ్ వీక్‌గా ఉంటుంది. అక్కడ కొన్ని సన్నివేశాలు తీసేయొచ్చేమో అనిపిస్తుంది. కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. సెకండాఫ్ మాత్రం చాలా షార్ప్‌గా ఉంటుంది. దర్శకుడిగా అనుదీప్ మరోసారి తన కామెడీ పట్టు చూపించాడు.. డైలాగ్స్ బాగున్నాయి. కంటెంట్ లేకుండా.. కేవలం కామెడీపైనే మరోసారి సినిమా అంతా నడిపించాలని చూసాడు. జాతి రత్నాలు రేంజ్‌లో కాకపోయినా.. ఇక్కడ కూడా బాగానే సక్సెస్ అయ్యాడు అనుదీప్.

పంచ్ లైన్: ప్రిన్స్.. నో లాజిక్.. ఓన్లీ కామెడీ మ్యాజిక్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్