Puneeth Rajkumar : పునీత్ రాజ్‏కు అరుదైన గౌరవం.. ఆ రోజు కర్ణాటక రత్న అవార్డ్ ప్రధానం చేయనున్న సీఎం..

నవంబర్ 1న బెంగుళూరులోని విధానసౌధ (శాసనసభ) ఎదుట జరిగే కార్యక్రమంలో ఈ అవార్డ్ అందించనున్నారు. మంత్రులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, పునీత్ కుటుంబ సభ్యులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.

Puneeth Rajkumar : పునీత్ రాజ్‏కు అరుదైన గౌరవం.. ఆ రోజు కర్ణాటక రత్న అవార్డ్ ప్రధానం చేయనున్న సీఎం..
Puneeth Rajkumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 21, 2022 | 4:18 PM

కన్నడ పవర్ స్టార్..దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్‏కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన మరణాంతరం కర్ణాటక రత్న అవార్డుతో సత్కరించనున్నట్లు గతంలోనే కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించారు పునీత్. అప్పు అకాల మరణంతో కన్నడిగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ అభిమాన హీరో మరణాన్ని ఇప్పటికీ అటు అప్పు కుటుంబసభ్యులు.. అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల జరిగిన గణేశ్ చతుర్ధి ఉత్సావాల్లో సైతం వినాయకుడితోపాటు పునీత్ విగ్రహాలకు పూజలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చిత్రపరిశ్రమలో.. ప్రజలలో అప్పు చేసిన కృషికి గానూ కర్ణాటక ప్రభుత్వం ఈ అవార్డును అందచేస్తుంది. నవంబర్ 1న బెంగుళూరులోని విధానసౌధ (శాసనసభ) ఎదుట జరిగే కార్యక్రమంలో ఈ అవార్డ్ అందించనున్నారు. మంత్రులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, పునీత్ కుటుంబ సభ్యులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.

ఇప్పటివరకు ఎనిమిది మందిని మాత్రమే ఈ అవార్డుతో సత్కరించినట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. 2009 అనంతరం ఈ అవార్డును ఎవరు అందుకోలేదు. కన్నడ చిత్ర పరిశ్రమ, భాష, సంస్కృతికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా మరణానంతరం ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. “తన విజయాల ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకున్న పునీత్ రాజ్‌కుమార్ నిజమైన కర్ణాటక రత్న. యువతకు స్ఫూర్తిదాయకమని సీఎం బొమ్మై అన్నారు. నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలకు విధానసౌధలో అవార్డు ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు, సినీ ప్రముఖులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి

పునీత్‌కు నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అభిమానులు డిమాండ్ చేశారు. వారి కొరిక మేరకు నవంబర్ 1 అవార్డు ప్రధానోత్సం తర్వాత, బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో మరో మూడు కార్యక్రమాలు జరుగుతాయని బొమ్మై చెప్పారు.