Bheemla Nayak: భీమ్లా నాయక్ చిత్రానికి పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఛాయిస్ కాదట.. బాలయ్య ముందు అసలు విషయం చెప్పిన ప్రొడ్యూసర్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ సాగర్ కె చంద్ర కాంబోలో వచ్చిన భీమ్లానాయక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఫస్ట్ ఛాయిస్ పవర్ స్టార్ కాదట. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ చెప్పారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకుందామా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రతినాయకుడిగా రానా అదరగొట్టారు. మొదటిసారి వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకులు.. సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రాశారు. ఇందులో పవన్ సరసన నిత్యా మీనన్ కథానాయికగా నటించింది. అయితే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీకి పవన్ ఫస్ట్ ఛాయిస్ కాదట. మరే హీరో అని ఆలోచిస్తున్నారా ? అతను మరెవరో కాదు.. నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఇటీవల అన్ స్టాపబుల్ షోలో బయటపెట్టారు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య.. ప్రముఖ ఓటీటీ వేదికగా ఆహాలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలయ్య .. తనదైన పంచులు.. ప్రాసలతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు. అలాగే..తన స్టైల్లో అతిథుల నుంచి సమాధానాలు రాబడుతూ మెప్పిస్తున్నారు.
మొదటి ఎపిసోడ్ టీడీపీ అధినేత చంద్రబాబు.. నారా లోకేష్ సందడి చేయగా.. రెండవ ఎపిసోడ్ లో యంగ్ హీరోస్ సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లు వచ్చారు. ఇక ఆ తర్వాత వచ్చిన నిర్మాత సూర్యదేవర నాగవంశీని సైతం ఓ ఆటాడుకున్నారు బాలయ్య. ఈ క్రమంలోనే పవర్ స్టార్ నటించిన భీమ్లా నాయక్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను రాబట్టారు. ఈ సినిమాకు ఫస్ట్ హీరో ఎవరు అని అడగ్గా. మీరే సర్.. మీ చుట్టూ తిరిగి.. మిమ్మల్ని అడిగి .. సినిమా చూసి మీరే కదా సర్ నాకు సాజిస్ట్ చేశారు కళ్యాణ్ గారికి అయితే బావుంటుందని అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన క్లిప్ నెట్టింట వైరలవుతుంది.




ప్రస్తుతం బాలయ్య మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఎన్బీకే 107 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత బాలయ్య.. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నారు.