AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కథ వినకుండానే నో చెప్పా.. నేను చేయాల్సిన సినిమా ఆమె చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది

మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలి సినిమాతోనే ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. అందాల రాక్షసి సినిమాతో నటన పరంగా మెప్పించిన ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది.

కథ వినకుండానే నో చెప్పా.. నేను చేయాల్సిన సినిమా ఆమె చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది
Lavanya Tripathi
Rajeev Rayala
|

Updated on: Mar 16, 2026 | 4:39 PM

Share

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది అందాల భామ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో క్యూట్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా లావణ్యకు చెప్పుకోదగ్గ హిట్ మాత్రం పడలేదు. కానీ టాలీవుడ్ లో యంగ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు మెగా హీరోవరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ ఇద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు. అదే సమయంలో ప్రేమలో పడటంతో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు లావణ్య, వరుణ్.

ఈ జంటకు ఓ కొడుకుకూడా ఉన్నాడు. పెళ్లి తర్వాత లావణ్య సినిమాలు కంటిన్యూ చేస్తుంది. అయితే ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఇటీవలే ఓటీటీ కోసం ఓ సినిమా చేసింది లావణ్య. ఇదిలా ఉంటే లావణ్య ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకుందట. ఇటీవల లావణ్య త్రిపాఠి వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. అలాగే ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కెరీర్ లో మిస్ చేసుకున్న బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా ఏదైనా ఉందా అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం  చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఓ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు కథ వినకుండానే నో చెప్పా.. అయితే ఆతర్వాత కథ తెలిసినప్పుడు సినిమా చేయాలని ఆశపడ్డా.. కానీ అప్పటికే అవకాశం చేజారిపోయిందని తెలిపింది. ఆతర్వాత ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని తెలిపింది లావణ్య. ఆ సినిమా ఎదో కాదు. విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన గీత గోవిందం. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ పాత్ర కోసం లావణ్యను సంప్రదించారట.. కొన్ని కారణాల వల్ల ఆమె నో చెప్పడంతో రష్మిక మందన్న ఆ ఛాన్స్ అందుకుందట. ఇక గీత గోవిందం సినిమాతో ఫ్రెండ్స్ గా మారిన విజయ్, రష్మిక ప్రేమలో పడి ఇటీవలే పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us