Andhra: ఆటగదరా శివ..! కూతురి టెన్త్ పరీక్షలు.. గుడికి వెల్దామని బయలుదేరారు.. అంతలోనే..
శ్రీనగర్ కు చెందిన రామకృష్ణ కూతురు స్వప్న పదో తరగతి చదువుతోంది. పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యింది. సోమవారం నుంచి పరీక్షల ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో తన చిట్టి తల్లికి ఆ దేవుడు ఆశీస్సులు పొందాలని.. కూతురు స్వప్నతో బయలుదేరాడు తండ్రి రామకృష్ణ.. ఆదివారం సింహాచలం ఆలయానికి టూ వీలర్ పై ఇద్దరూ సరదాగా వెళ్తున్నారు..

శ్రీనగర్ కు చెందిన రామకృష్ణ కూతురు స్వప్న పదో తరగతి చదువుతోంది. పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యింది. సోమవారం నుంచి పరీక్షల ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో తన చిట్టి తల్లికి ఆ దేవుడు ఆశీస్సులు పొందాలని.. కూతురు స్వప్నతో బయలుదేరాడు తండ్రి రామకృష్ణ.. ఆదివారం సింహాచలం ఆలయానికి టూ వీలర్ పై ఇద్దరూ సరదాగా వెళ్తున్నారు. బీహెచ్పీవీ హైవేపై సిగ్నల్ పాయింట్ వద్ద ఆగారు. మారికవలసకు చెందిన సతీష్ ఇటీవల వివాహం నిశ్చయమైంది. వచ్చే నెలలో పెళ్లి. ఆదివారం తెల్లవారే టూవీలర్ పై సొంత పనుల కోసం బయలుదేరాడు. హైవేపై వెళుతూ.. బీహెచ్పీవీ సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగాడు. కొద్ది క్షణాల్లోనే.. గ్రీన్ సిగ్నల్ పడగానే ఎవరికి వారు తమ గమ్యస్థానాలకు బయలుదేరారు. ఇంతలో ఓ ట్రాలర్ లారీ.. వెనుక వైపు నుంచి హై స్పీడ్ గా దూసుకొచ్చింది. సిగ్నల్ పాయింట్ వద్ద ఆగి ఉన్న వాహనాలపై దూసుకెళ్లింది. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనతో.. ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వారిలో ఒకరు గాయపడ్డారు. అప్పటివరకు తనతో సరదాగా మాట్లాడుతున్న తండ్రి.. కూతురు కళ్ళముందే విగతాజీవిగా మారిపోవడంతో ఆ యువతి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. మరో కుటుంబంలో పెళ్లి బాజాలు మొగాల్సిన సమయంలో విషాదం అలుముకుంది.
ఆదివారం ఉదయాన్నే ఓ మృత్యుశకటం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. టెన్త్ పరీక్షలు రాయాల్సిన ఓ బాలిక తండ్రిని.. వచ్చే నెల పెళ్లి కావలసిన ఒక యువకుడిని బలి తీసుకుంది. విశాఖలో బీహెచ్పీవీ కూడలి హైవే వద్ద ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
గాజువాక నుంచి ఎన్ఏడీ వైపు వెళ్తున్న టిప్పర్ లారీ.. సిగ్నల్ పడినా ఆగకుండా ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆగి ఉన్న మూడు ద్విచక్ర వాహనాలు, ఒక కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలపై ఉన్న ఇద్దరు అక్కడికికక్కడే మృతి చెందగా.., మరో ద్విచక్ర వాహనంపై ఉన్న యువతి తృటిలో తప్పించుకుంది. తీవ్ర గాయాలయ్యాయి.
పరీక్షలు కావడంతో సింహాచలం దైవదర్శనానికి వెళ్తుండగా..
శ్రీనగర్ లో నివసిస్తున్న గాజువాక వరుణ్ మోటార్స్ సూపర్వైజర్ రామకృష్ణ.. తన కుమార్తె స్వప్న పదవ తరగతి చదువుతోంది. సోమవారం నుంచి పరీక్షల సందర్భంగా సింహాచలం దైవదర్శనానికి ఆదివారం ఉదయం వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ట్రాలర్ ఢీకొనడంతో స్వప్న కుడివైపు పడిపోగా.. రామకృష్ణ ఎడమవైపు పడి లారీ చక్రాల కింద నలిగి మృతి చెందారు.
వచ్చే నెలలో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో..
ఈ దురఘటనలో ప్రాణాలు కోల్పోయిన మారికవలసకు చెందిన ఢిల్లీ సతీష్.. సిగ్నల్ వద్ద తన బైకు నిలిపాడు. మృత్యు శకటంలా దూసుకొచ్చిన టిప్పర్.. అతని పైనుంచి దూసుకెళ్లి ప్రాణాలు తీసింది. సతీష్ కు వచ్చే నెల 11వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు బాజాలు మోగాల్సిన దుస్థితి ఏర్పడిందని విషాదంలో మునిగిపోయారు కుటుంబ సభ్యులు.
మరో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆయనను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చిన కారును కూడా టిప్పర్ లారీ 50 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. అయితే ఆ కారులో ఉన్న ప్రయానికులు క్షేమంగా బయటపడ్డారు. డ్రైవర్ మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. బీహెచ్ పీవీ జంక్షన్ లో ట్రాఫిక్ అదుపు చేస్తున్న హోంగార్డ్ లక్ష్మణరావు.. ట్రాలర్ అతి వేగంగా రావటం చూసి పక్కకు వెళ్ళాడు. ప్రాణాలు కాపాడుకున్నారు. ఒక్కసారిగా జరిగిన ఘటనతో షాపులోకి వెళ్ళాడు ఆ హోం గార్డ్ . పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.. ఈ ఘటనతో రెండు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
