AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 2nd T20I: రెండో వన్డేకు ముందే టీమిండియాకు షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్..?

India vs England 2nd ODI: తొలి వన్డేలో అద్భుత విజయంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. కెప్టెన్ గిల్ దూరం కావడం పెద్ద లోటే అయినప్పటికీ, శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా పటిష్టమైన ప్రదర్శన చేసి ఇంగ్లండ్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపిస్తుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

IND vs ENG 2nd T20I: రెండో వన్డేకు ముందే టీమిండియాకు షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్..?
Ind Vs Eng 2nd Odi
Venkata Chari
|

Updated on: Jul 16, 2026 | 10:27 AM

Share

India vs England 2nd ODI: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి ఘనంగా బోణీ కొట్టిన టీమిండియాకు ఊహించని పెద్ద దెబ్బ తగిలింది. అద్భుత ఫామ్‌లో ఉంటూ జట్టును ముందుండి నడిపిస్తున్న యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా రెండో వన్డేకు దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు కొత్త సారథి పగ్గాలు చేపట్టబోతున్నట్లు క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

మైదానంలో కన్నీళ్లు పెట్టించిన ఆ కండరాల నొప్పి!

బర్మింగ్హామ్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఆడిన ఇన్నింగ్స్ అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు త్వరగా అవుటైనా, గిల్ ఏమాత్రం బెదరలేదు. ఎంతో బాధ్యతాయుతంగా ఆడుతూ 75 బంతుల్లో 80 పరుగులు చేసి సెంచరీ వైపు దూసుకెళ్లాడు. అయితే, దురదృష్టవశాత్తు కుడికాలి కండరాల నొప్పి (క్రాంప్స్) తీవ్రం కావడంతో అతను క్రీజులోనే కుప్పకూలిపోయాడు. చివరకు నడవలేని స్థితిలో రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. మ్యాచ్ ముగిసిన తర్వాత తనేమీ ఆందోళన చెందడం లేదని, త్వరలోనే కోలుకుంటానని గిల్ చెప్పినప్పటికీ.. తాజా నివేదికల ప్రకారం అతని గాయం తీవ్రత ఇంకా తగ్గలేదని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: అతను యమ డేంజర్.. ఏడుగుర్ని దింపినా ఒంటిచేత్తో మా దూల తీర్చాడు.. హ్యారీ బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!

ఇవి కూడా చదవండి

లండన్ వేదికగా తుది నిర్ణయం.. రిస్క్ వద్దంటున్న యాజమాన్యం..

కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా గురువారం జరగబోయే రెండో వన్డేకు గిల్ అందుబాటులో ఉంటాడా లేదా అనే అంశంపై బీసీసీఐ వైద్య బృందం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, భవిష్యత్తులో జరగబోయే కీలక టోర్నీలను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల నేపథ్యంలో గిల్ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు వద్దని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కొద్దిపాటి నొప్పి ఉన్నా సరే అతనికి ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వడమే ఉత్తమమని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ యోచిస్తున్నట్లు సమాచారం. గిల్ స్థానంలో తుది జట్టులోకి మరో యువ ఆటగాడిని తీసుకునే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: సూర్యకుమార్ కాదు, తిలక్ వర్మ అంతకన్నా కాదు.. కొత్త కెప్టెన్‌గా టీమిండియా తోపు ప్లేయర్..?

సారథ్య బాధ్యతల్లో శ్రేయాస్ అయ్యర్..!

ఒకవేళ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌కు పూర్తిగా దూరమైతే, జట్టును నడిపించే బాధ్యత ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు జట్టులో ఉన్నప్పటికీ, వారు వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. జట్టు వైస్ కెప్టెన్ అయిన శ్రేయాస్ అయ్యర్ ఈ చారిత్రాత్మక బాధ్యతను భుజాన వేసుకోనున్నాడు. శ్రేయాస్ అయ్యర్‌కు గతంలో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి పెద్ద జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టిన అపారమైన అనుభవం ఉంది. అతని దూకుడు స్వభావం, ఒత్తిడిని తట్టుకునే మానసిక పటిమ ఇంగ్లండ్‌పై భారత్‌ను గెలిపించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: వాళ్లు వేస్ట్, సైడ్ క్యారెక్టర్లంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. గంభీర్ పరువు కాపాడి హీరోలుగా మారిన ఇద్దరు

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us