T20 World Cup 2022: మొదలైన టీ20 మహా సంగ్రామం.. తొలి మ్యాచ్‌లో కివీస్‌తో ఢీకొట్టనున్న ఆసీస్.. ఇరుజట్ల ప్లేయింగ్ XI ఇదే..
AUS vs NZ: టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తుంది.
టీ20 మహ సంగ్రామం మొదలైంది. ఇందులో భాగంగా సూపర్ 12 మ్యాచ్‌లు నేటి నుంచి నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో తలపడనున్నాయి. కాగా, ఈ రెండు జట్లు గత T20 ప్రపంచ కప్‌లో ఫైనలిస్టులుగా పోటీ పడిన సంగతి తెలిసిందే. ఇక్కడ న్యూజిలాండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి వీరి మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
జట్టులోకి తిరిగి వచ్చిన ఫెర్గూసన్..
లాకీ ఫెర్గూసన్ న్యూజిలాండ్ జట్టులోకి తిరిగి వచ్చాడు. గాయం కారణంగా స్వదేశంలో ఆడే ముక్కోణపు సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో పాటు ప్లేయింగ్ ఎలెవన్‌లో మైకేల్ బ్రేస్‌వెల్, ఆడమ్ మిల్నేలకు చోటు దక్కలేదు.
ఇరు జట్ల ప్లేయింగ్ XI..
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే(w), ఫిన్ అలెన్, కేన్ విలియమ్సన్(c), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్ (సి), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (w), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్