AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దోమలు కొందరినే ఎక్కువగా ఎందుకు కుడతాయో తెలుసా? తాజా పరిశోధనలో సంచలన విషయాలు..

Mosquitoes Bites: మానవుల శరీరం దోమలకు ప్రోటీన్ షేక్ లాగా కనిపిస్తుందంట. అందుకే తెగ దాడి చేస్తుంటాయని, మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు, అలాగే బీర్ తాగిన వారిపై దోమలు మరింతంగా దాడి చేస్తాయని నిపుణులు కనుగొన్నారు.

దోమలు కొందరినే ఎక్కువగా ఎందుకు కుడతాయో తెలుసా? తాజా పరిశోధనలో సంచలన విషయాలు..
Mosquito Bite
Venkata Chari
|

Updated on: Oct 20, 2022 | 7:18 PM

Share

దోమలు ఉన్న ప్రదేశంలో ముగ్గురు, నలుగురు నిల్చుని ఉన్నప్పుడు.. కొందరిని దోమలు ఎక్కువగా కుడుతుంటాయి. మరికొందరిని మాత్రం కుట్టవు. మరి ఎవరిని ఎక్కువగా కుడుతుందో దోమ ఎలా నిర్ణయిస్తుంది? అసలు అవి డిసైడ్ చేసుకుంటాయని మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఈ విషయంపై మనలో చాలామందికి ఎన్నో ప్రశ్నలు వేస్తుంటాయి. ఎట్టకేలకు శాస్త్రవేత్తలు పరిశోధన ద్వారా దీనికి సమాధానం కొనుగోన్నారు. ఏళ్ల తరబడి ప్రజలను వేధిస్తోన్న ప్రశ్నకు నేటికి సమాధానం దొరికింది. ‘ఆకలితో ఉన్న దోమలు శరీరాన్ని పెద్ద ప్రోటీన్ షేక్ లాగా భావించి, దాడి చేసి, రక్తాన్ని తాగుతుంటాయి.

ఆ వ్యక్తలపైనే ఎక్కువగా దాడి..

కొందరు వ్యక్తుల పట్ల దోమలు ఎక్కువగా ఆకర్షితులవుతాయంట. అంటే మన శరీరం నుంచి వచ్చే వాసనకు దోమలు ఆకర్షితులవుతుంటాయంట. కొంతమంది వ్యక్తులు తమ చర్మంపై వాసనతో ముడిపడి ఉన్న నిర్దిష్ట రసాయనాన్ని ఉత్పత్తి చేస్తారని పరిశోధకులు కనుగొన్నారు. దీంతో దోమలు వాటికి ఆకర్షితులవుతుంటాయి. బ్లడ్ సక్కర్స్ కాలక్రమేణా తమకు ఇష్టమైన వాటికి విధేయంగా ఉండటమే దీన్ని మరింత దిగజారుస్తుందని వారు కొనుగొన్నారు.

64 మందిపై పరిశోధనలు..

ఇందుకోసం పరిశోధకులు ప్రజల సువాసనలపై ఒక ప్రయోగాన్ని రూపొందించారు. న్యూయార్క్‌లోని రాక్‌ఫెల్లర్ విశ్వవిద్యాలయం నుంచి 64 మంది వాలంటీర్లను వారి చర్మం వాసన వ్యతిరేఖంగా వారి ముంజేతుల చుట్టూ నైలాన్ స్టాకింగ్ ధరించమని కోరారు. వీటి చివరలో ప్రత్యేకమైన ఉచ్చును ఉంచారు.ఆ వెంటనే డజన్ల కొద్దీ దోమలు వచ్చి చేరాయంట. వాటిలో ఎల్లో ఫీవర్, జికా, డెంగ్యూలను వ్యాప్తి చేసే ఏడిస్ ఈజిప్టి జాతి దోమలను ఉన్నాయంట. వీరిపట్ల దోమలు చాలా ఆకర్షణీయంగా మారడం పరిశోధకులు గమనించారు.

ఇవి కూడా చదవండి

డియో లేదా పెర్ఫ్యూమ్ మార్చినా వదలవంట..

దోమలు, శరీర వాసనల మధ్య సంబంధం ప్రత్యేకమైనది. మీరు డియో లేదా పెర్ఫ్యూమ్ అప్లై చేసినా లేదా షాంపూని మార్చుకున్నా, దోమలను ఆకర్షించే మీ శరీర వాసన వాటికి మారదని మూడేళ్లపాటు సాగిన పరిశోధనలో వెల్లడైంది. చెమటలు పడుతున్నాయా, ఆ రోజు ఏం తిన్నామా అన్నది కూడా ముఖ్యం కాదంట. ఒకసారి మీ శరీరం నుంచి వచ్చే వాసనతో దోమలు ఆధిపత్యం చెలాయిస్తే, మీరు ఏమి చేసినా, మీరు ఎల్లప్పుడూ దోమల వల్ల ఇబ్బంది పడుతూనే ఉండాల్సిందేనని వారు తేల్చారు. దీంతో మీరు దోమలకు ఇష్టమైన ఆహారంగా మారతారని పేర్కొన్నారు.

బీర్ తాగిన తర్వాత దోమలు ఎక్కువగా ఆకర్షితమవుతాయంట..

శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను రకరకాలుగా సాగించారు. కానీ, ఏ వ్యక్తి శరీరం నుంచి వచ్చే దుర్వాసనలు లేదా ఏ యాసిడ్ ఏర్పాటవుతుందనే దానిపై పరిశోధనలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. అయితే, మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు లేదా బీర్ తాగినప్పుడు దోమలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయని నిపుణులు కనుగొన్నారు.

అలాగే పరిశోధకులు కార్బాక్సిలిక్ ఆమ్లాల వాసన ఎక్కువగా ఉన్న వ్యక్తులను ఇతర వ్యక్తులతో పోలిస్తే 100 సార్లు ఆడ ఈడిస్ ఈజిప్టి (దోమ ప్రత్యేక జాతి) పొందారని కనుగొన్నారు. ఈ ఆడ దోమ (Aedes aegypti) డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్, జికా వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తుందని తేల్చారు.

దోమలే వ్యాధులకు ప్రధాన కారణం..

ప్రపంచంలో ప్రతి సంవత్సరం 700 మిలియన్ల మంది ప్రజలు దోమల వల్ల కలిగే వ్యాధుల బారిన పడుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఈ దోమల సంఖ్య పెరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు వేసినా.. ఈ దోమలు మాత్రం అంతకంతకు పెరుగుతూ మనుషుల పాలిట విలన్‌లా తయారయ్యాయి.