AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hat-trick Video: టీ20 ప్రపంచ కప్‌ 2022లో తొలి హ్యాట్రిక్.. ఆసియా విజేతకు చుక్కలు చూపించిన యూఏఈ బౌలర్..

SL vs UAE: ఈ క్రమంలో లంక జట్టుపై ఓ యూఏఈ బౌలర్ హ్యాట్రిక్ సాధించి, ఆసియా కప్ విజేతకు భారీ షాక్ ఇచ్చాడు. యూఏఈ బౌలర్ కార్తీక్ మెయ్యప్పన్ 15వ ఓవర్‌లో మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు.

Hat-trick Video: టీ20 ప్రపంచ కప్‌ 2022లో తొలి హ్యాట్రిక్.. ఆసియా విజేతకు చుక్కలు చూపించిన యూఏఈ బౌలర్..
Karthik Meiyappan
Venkata Chari
|

Updated on: Oct 18, 2022 | 3:17 PM

Share

టీ20 ప్రపంచకప్‌‌ 2022లో భాగంగా ప్రస్తుతం క్వాలిఫయర్లు జరుగుతున్నాయి. మంగళవారం రెండో మ్యాచ్‌ శ్రీలంక-యూఏఈ మధ్య గీలాంగ్‌లో జరుగుతోంది. అయితే, శ్రీలంక టీం టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఈ క్రమంలో యూఏఈ బౌలర్లు ఆది నుంచి లంకను ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో లంక జట్టుపై ఓ యూఏఈ బౌలర్ హ్యాట్రిక్ సాధించి, ఆసియా కప్ విజేతకు భారీ షాక్ ఇచ్చాడు. యూఏఈ బౌలర్ కార్తీక్ మెయ్యప్పన్ 15వ ఓవర్‌లో మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు. యూఏఈ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్‌ను తొలుత ధాటిగానే ఆరంభించింది. ప్రస్తుతం16 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది.

యూఏఈ స్పిన్నర్ కార్తీక్ మెయ్యప్పన్ 2022 టీ20 ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్ సాధించాడు. అతను శ్రీలంక ఇన్నింగ్స్ 15వ ఓవర్ నాలుగో, ఐదు, ఆరో బంతుల్లో భానుక రాజపక్సే, చరిత్ అసలంక, దసున్ షనక వికెట్లను పడగొట్టాడు. ఈ ప్రపంచకప్‌లో ఇదే తొలి హ్యాట్రిక్‌. అదే సమయంలో, ఓవరాల్ టీ20 ప్రపంచకప్‌లో ఇది ఐదో హ్యాట్రిక్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

హ్యాట్రిక్ వీడియో ఇక్కడ చూడండి..

పవర్ ప్లేలో ధాటిగా బ్యాటింగ్..

ఓపెనర్లు పాతుమ్ నిసంక, కుశాల్ మెండిస్ లంకకు శుభారంభం అందించారు. వీరిద్దరి మధ్య తొలి వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం అందించారు.

T20 ప్రపంచ కప్ చరిత్రలో హ్యాట్రిక్స్..

1. బ్రెట్ లీ (ఆస్ట్రేలియా) Vs బంగ్లాదేశ్, కేప్ టౌన్-2007

2. కర్టిస్ కాంప్ఫెర్ (ఐర్లాండ్) Vs నెదర్లాండ్స్, అబుదాబి 2021

3. వనిందు హసరంగా (శ్రీలంక) Vs దక్షిణాఫ్రికా, షార్జా 202

4. కగిసో రబడ (దక్షిణాఫ్రికా) Vs ఇంగ్లాండ్, షార్జా 2021

5. కార్తీక్ మెయ్యప్పన్, UAE Vs ​​శ్రీలంక, గీలాంగ్ 2022

ఇరుజట్ల ప్లేయింగ్ XI..

శ్రీలంక: పాతుమ్ నిసంక, కుశాల్ మెండిస్, డిడి సిల్వా, చరిత్ అష్లాంక, బి రాజపక్సే, డి షనక (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేష్ తీక్షణ, దుష్మంత చమేరా, ప్రమోద్ మధుషన్.

యూఏఈ: వసీం ముహమ్మద్, సీపీ రిజ్వాన్ (కెప్టెన్), ఆర్యన్ లక్రా, వీ అరవింద్, చిరాగ్ సూరి, బాసిల్ హమీద్, కాషిఫ్ దావూద్, అయాన్ అఫ్జల్ ఖాన్, కే మెయ్యప్పన్, జునైద్ సిద్ధిఖీ, జహూర్ ఖాన్.