Video: ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది.. నవ్వులు పూయిస్తోన్న సూర్య కుమార్ మిస్ ఫైరింగ్ షాట్..
ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 50 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు. అయితే, ఈ క్రమంలో జరిగిన ఓ సంఘటన నవ్వులు పూయిస్తోంది.
సూర్యకుమార్ యాదవ్ తుపాన్ వేగంతో దూసుకపోతున్నాడు. ఈ క్రమంలో పరుగుల వర్షం కురిపిస్తూ.. బౌలర్లపై విరుచుకపడుతున్నాడు. అతని బ్యాట్ నిరంతరం నిప్పులు చెరుగుతూనే ఉంది. 2022 T20 ప్రపంచ కప్‌లో అందరి దృష్టి ఈ మిస్టర్ 360 ప్లేయర్‌పైనే నిలిచింది. తాజాగా సూర్య మరోసారి వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని చూపించాడు. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 33 బంతుల్లో 50 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. సూర్య తన అద్భుతమైన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు.
కాగా, 20వ ఓవర్ నాలుగో బంతికి కేన్ రిచర్డ్‌సన్‌కు బలయ్యాడు. సూర్య క్యాచ్ అవుట్ అయిన తర్వాత, ఆస్ట్రేలియన్ బౌలర్ రిచర్డ్‌సన్ నవ్వుతూ కనిపించాడు. అయితే, ఓ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సూర్య.. అది కాస్త మిస్ అవ్వడంతో బౌలర్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, ఏం జరిగిందో తెలియని అయోమంలో పడిన బ్యాటర్, బౌలర్.. ఈ పరిస్థితిని తలచుకుని తెగ నవ్వులు కురిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది.
రిచర్డ్‌సన్ బౌండరీని ఆశించాడు..
రిచర్డ్‌సన్ నవ్వడానికి కారణం సూర్య వికెట్ కోల్పోయిన బంతి. భారత ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్ చేశాడు. నాలుగో బంతి వేసిన రిచర్డ్ సన్.. అది బౌండరీ దాటి పోతుందనే అనుకున్నాడు. కానీ, సూర్య షాట్ మిస్ ఫైర్ అవ్వడంతో నవ్వులు కురిపించాడు.
View this post on Instagram
ఇష్టమైన షాట్ మిస్సవ్వడంతో..
బౌండరీ దాటి వెళుతున్న బంతిపై సూర్య తన ట్రేడ్‌మార్క్ షాట్‌ను మిస్ చేసి రిచర్డ్‌సన్‌కి క్యాచ్ ఇచ్చాడు. బౌలర్ దీనిని నమ్మలేకపోయాడు. సూర్య తనకు ఇష్టమైన షాట్‌ను మిస్ చేయడంతో రిచర్డ్‌సన్ తన నవ్వును నియంత్రించుకోలేకపోయాడు. అతని నోటిపై చేయి వేసుకుని నవ్వడం ప్రారంభించాడు.
What A Win! ? ?#TeamIndia beat Australia by 6⃣ runs in the warm-up game! ? ?
Scorecard ▶️ https://t.co/3dEaIjgRPS #T20WorldCup | #INDvAUS pic.twitter.com/yqohLzZuf2
— BCCI (@BCCI) October 17, 2022
సూర్య, రాహుల్ హాఫ్ సెంచరీలు..
బ్రిస్బేన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్‌తో పాటు కేఎల్ రాహుల్ 33 బంతుల్లో 57 పరుగులు చేశాడు. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అత్యధికంగా 76 పరుగులు చేశాడు. ఆరుగురు ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్లు 7 పరుగులకు కూడా చేయకుండా పెవిలియన్ చేరారు.