BCCI AGM: బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. సౌరవ్ గంగూలీకి భారీ షాకిచ్చిన సభ్యులు.. ఎందుకంటే?

బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం ముంబైలో ప్రారంభమైంది. రోజర్ బిన్నీ కొత్త అధ్యక్షుడిగా, మహిళల ఐపీఎల్‌ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

BCCI AGM: బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. సౌరవ్ గంగూలీకి భారీ షాకిచ్చిన సభ్యులు.. ఎందుకంటే?
Sourav Ganguly Roger Binny
Follow us
Venkata Chari

|

Updated on: Oct 18, 2022 | 12:52 PM

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ ఎన్నికయ్యారు. ఈరోజు జరిగిన ‘వార్షిక సర్వసభ్య సమావేశం’ (ఏజీఎం)లో ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో BCCI తరపున అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఏ పదవికి ఎవరి పేరును ప్రకటించలేదు. కాగా, ఐసీసీలోని పోస్టులకు నామినేషన్లు వేయడానికి చివరి తేదీ గురువారం వరకే ఉంది.

బీసీసీ అధ్యక్షుడు: రోజర్ బిన్నీ కార్యదర్శి: జై షా వైస్ ప్రెసిడెంట్: రాజీవ్ శుక్లా ట్రెజరర్: ఆశిష్ షెలార్ జాయింట్ సెక్రటరీ: దేవ్‌జిత్ సైకియా IPL చైర్మన్: అరుణ్ ధుమాల్

ఈ మేరకు బీసీసీఐ పెద్దలు మాట్లాడుతూ, “ఐసీసీ ఖాళీలకు నామినేషన్లు వేయడానికి చివరి తేదీ గురువారం. అయితే, బీసీసీఐలో కుదిరిన ఏకాభిప్రాయం ప్రకారం ఈసారి బీసీసీఐ వైపు నుంచి ఐసీసీ పదవికి ఎవరూ నామినేట్ చేయరు.” అని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

“ఐసీసీ అత్యున్నత పదవికి ఎవరూ పరిగణించబడరని, ఈమేరకు బోర్డు దాని స్వంత అభ్యర్థిని కలిగి ఉండాలా లేదా బార్క్లీకి మద్దతివ్వాలా అనే ఎంపిక సభ్యులు తర్వాత నిర్ణయిస్తారని” తెలిపారు.

ముంబైలో బీసీసీఐ ఏజీఎం సమావేవం నేడు జరిగింది. బీసీసీఐ పెద్దలంతా సమావేశానికి చేరుకున్నారు. బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి క్లియరెన్స్ పొందిన సౌరవ్ గంగూలీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ భేటీలో ఆయన భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం చాలా కీలకమైనది. ఇందులో నాలుగు పెద్ద నిర్ణయాలు తీసుకోచ్చవని భావిస్తున్నారు. బీసీసీఐ ఏజీఎం తర్వాత బోర్డు కొత్త చైర్మన్‌ను ప్రకటించారు. బీసీసీఐ కొత్త చీఫ్‌గా సౌరవ్ గంగూలీ స్థానంలో మాజీ క్రికెటర్, సెలెక్టర్ రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారు.

బీసీసీఐ ఏజీఎంలో సౌరవ్ గంగూలీ భవిష్యత్తుపై కూడా పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. ఐసీసీ చైర్మన్ పదవికి సౌరవ్ గంగూలీ పేరును పరిశీలిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. BCCI అధ్యక్షుడిగా అతని పనిపై ప్రశ్నలు లేవనెత్తినందున అది అసంభవం అనిపిస్తుంది. అయితే, తాను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌లోకి తిరిగి రాబోతున్నట్లు గంగూలీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

బీసీసీఐ ఏజీఎంలో మహిళల ఐపీఎల్ పైనా కీలక నిర్ణం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం మహిళా ఐపీఎల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని విశ్వసనీయ సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో ఈ టోర్నీ జరగనుంది.

బీసీసీఐ ఏజీఎంలో అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు రూ. 30 కోట్లు ఇవ్వనున్నారు. బీసీసీఐ తన లాభాల వాటాను అన్ని సంఘాలకు పంచుతుంది.