- Telugu News Sports News Cricket news Meet Virat Kohli's beautiful fangirl Ameesha Basera whose pictures are trending on internet
Virat Kohli: కొహ్లీతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న ఈ అమ్మాయి ఎవరు? ‘విరాట్ నువు చాలా లక్కీ’..వైరల్ ఫొటోలు
టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులున్నారు. టీం ఇండియా మాజీ కెప్టెన్ కావడంతో కోహ్లీకి మన దేశంలోనేకాకుండా ఇతర దేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో బయట ఎక్కడ కనిపించినా కోహ్లితో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం వేల సంఖ్యలో అభిమానులు వెంటపడు..
Updated on: Oct 18, 2022 | 1:17 PM

టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులున్నారు. టీం ఇండియా మాజీ కెప్టెన్ కావడంతో కోహ్లీకి మన దేశంలోనేకాకుండా ఇతర దేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో బయట ఎక్కడ కనిపించినా కోహ్లితో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం వేల సంఖ్యలో అభిమానులు వెంటపడుతుంటారు. టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న కోహ్లీని ఓ అభిమాని వెంటాడుతోంది.

బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్ సమయంలో.. అమీషా బసేరా అనే యువతి కొహ్లీతో సెల్ఫీ తీసుకుని, అనంతరం 'ది స్వీటెస్ట్' అనే క్యాప్షన్‌తో ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే కొద్ది సేపట్లోనే అమీషా బసేరా, విరాట్ కోహ్లీల ఫోటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఫొటో అప్‌లోడ్ చేయడానికి ముందు కేవలం 1000 మంది ఫాలోవర్లు ఉన్న అమీషా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్, ఆ తర్వాత అమాంతంగా పెరిగిపోయారు.

కోహ్లీ వల్ల కాదండోయ్! కోహ్లీతో ఫొటో దిగిన అభిమాని అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో అమీషా అందానికి ఫ్లాట్ ఆయిన ఓ సోషల్ మీడియా యూజర్ కామెంట్ సెక్షన్‌లో 'ఫాలోవర్ స్టోక్స్' అని కామెంట్ చేశాడు. ‘విరాట్ మీరు చాలా లక్కీ’ అని ఓ అభిమాని కోట్ చేశారు.

33 ఏళ్ల అమీషా యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌లో చదువుకుంటోన్న ఓ స్టూడెంట్. టీ20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి కేవలం 19 పరుగులకే ఔటయ్యాడు. ఇక రెండో ప్రాక్టీస్ మ్యాచ్ బుధవారం న్యూజిలాండ్‌తో జరగనుంది.





























