Ramphal Benefits: మధుమేహ బాధితులు కూడా రామాఫలం తినొచ్చు.. ఆరోగ్య ప్రయోజనాల గురించి వైద్యులు ఏమంటున్నారంటే..

మనందరికీ సీతాఫలం గురించి మాత్రమే తెలుసు.. కానీ రామ ఫలం గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు.. రామ ఫలంలో కూడా అద్భుతమైన ఫలితాలు సమృద్ధిగా లభిస్తాయి.. ఈ పండు తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Ramphal Benefits: మధుమేహ బాధితులు కూడా రామాఫలం తినొచ్చు.. ఆరోగ్య ప్రయోజనాల గురించి వైద్యులు ఏమంటున్నారంటే..
Ramaphalam
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 20, 2022 | 5:32 PM

కొన్ని పండ్ల రుచి పదే పదే నూరూరిస్తుంది. మార్కెట్లో అవి ఎప్పుడొస్తాయా అని ఎదురుచూసేలా చేస్తాయి. అచ్చు అదే కోవకే చెందిన ఫలమే సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలాలు. మనరాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలం ఒక్కటే మనకు తెలుసు. కానీ ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు, లక్ష్మణఫలాలు ఎక్కువగా పండుతాయి. ఇప్పుడు సూపర్‌మార్కెట్ల పుణ్యమా అని ఇప్పుడిప్పుడు ఇవి అన్ని మార్కెట్లిలోనూ దొరుకుతున్నాయి. గుండ్రంగా హృదయాకారంలో ఎరుపురంగులో ఉండే ఈ రామాఫలం తొక్క సీతాఫలంకన్నా నునుపుగా ఉంటుంది. దీన్ని నెట్టెడ్‌ కస్టర్డ్‌ యాపిల్‌, బుల్లక్‌ హార్ట్‌, బుల్‌ హార్ట్‌ అని కూడా పిలుస్తారు. తియ్యని వాసనతో మధురమైన రుచిని కలిగి ఉండే ఈ రామాఫలం మన దేశంలోనే కాదు మధ్య అమెరికా, ఐరోపా దేశాల్లో ఎక్కువగా పండుతుంది. సీతాఫలంతో పోలిస్తే రామఫలంలో గింజలు తక్కువ ఉంటాయి. అలసిన శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది రామఫలంతో చేసిన జ్యూస్‌. మిగిలినవాటితో పోలిస్తే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. మలేరియా, క్యాన్సర్‌ వ్యాధులకు కారణమైన కణాలను నివారించే గుణం కూడా ఈ పండుకి ఎక్కువే ఉంటాయని వైద్యులు అంటారు.

పోషకాలు..

గింజలు చాలా తక్కువగా ఉండి పోషకాలు అధికంగా లభిస్తాయి. వంద గ్రాముల రామాఫలం నుంచి 75 క్యాలరీల శక్తి, 17.7గ్రాముల కార్బొహైడ్రేట్లు, 1.5గ్రాముల ప్రొటీన్లు, 3గ్రాముల. పీచూ లభిస్తాయి. శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్, కొవ్వు, ప్రోటీన్, విటమిన్ బి1, బి2, బి5, బి3, బి6, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం ఇలా ఎన్నో పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి.

మధుమేహ బాధితులకు..

పండ్ల విషయానికి వస్తే మధుమేహ బాధితులు ఏది తినాలి..? ఏది తినకూడదు..? అనేదానిలో చాలా కన్యూఫ్యూజ్ అవుతుంటారు. రాంఫాల్ ఒక హైపర్ లోకల్ ఫ్రూట్. ఇది రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించే గుణాలను కలిగి ఉన్నందున మధుమేహ బాధితులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది ప్రీ-డయాబెటిస్, డయాబెటిస్‌కు సరిగ్గా సరిపోయే ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంది. తీపి విషయానికి వస్తే సీతాఫలం కన్నా రామాఫలంలో తియ్యదనం తక్కువగా ఉంటుంది. అందుకే మధుమేహ బాధితులు  ఈ పండును తినొచ్చు. ఇందులోని పోషకాలు రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. రామాఫలంలోని విటమిన్ బి, విటమిన్ సి అధికంగా ఉంటాయి.

ఇది చర్మం, జుట్టుకు మంచిది..

మీకు చిట్లిన జుట్టు, మొటిమలతో ఇబ్బంది పడుతున్నట్లైతే.. రాంఫాల్ ఓ వరం అని చెప్పవచ్చు. ఇది మీ చర్మం, జుట్టు రెండింటికీ ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో సి- విటమిన్‌తో పాటు బి-కాంప్లెక్స్‌లోని పైరిడాక్సిన్‌ ఇందులో సమృద్ధిగా ఉంటుంది. మొటిమలను తగ్గించడంలో కూడా రాంఫాల్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ పైరిడాక్సిన్‌ మెదడు కణాలకు అవసరమైన రసాయనాల్ని స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపటంలో ఇది ఉత్తమంగా పనిచేస్తుంది.

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి..

కీళ్ల నొప్పులు ఉన్నవారికి రాంఫాలం ఓ అద్భుతమైన మెడిసిన్ అని చెప్పవచ్చు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టంతో పోరాడడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు

సీజన్‌లో మార్పుల కారణంగా అనారోగ్యానికి గురైన వారందరికీ, రాంఫాల్‌లోని విటమిన్ సి ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ సి తో పాటు, ఇందులో విటమిన్ ఎ, బి విటమిన్లు కూడా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని మరింత పెంచుతుంది. శరీరంలో మంటను కూడా తగ్గిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం