Diwali Sweets: దీపావళి రోజున మధుమేహ బాధితులు ఈ స్వీట్లను తినవచ్చు.. మిఠాయిల జాబితాను ఇక్కడ చూడండి

దీపావళి రోజు మధుమేహ బాధితులు అంజీర్‌తో చేసిన మిఠాయిలు తింటే మంచిదా..? కాదా..? అనే సందేహం అందిరిలో ఉంటుంది. అయితే ఏం చేయాలో తెలుసుకుందాం..

Diwali Sweets:  దీపావళి రోజున మధుమేహ బాధితులు ఈ స్వీట్లను తినవచ్చు.. మిఠాయిల  జాబితాను ఇక్కడ చూడండి
Figs
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 20, 2022 | 8:51 PM

దీపావళి సందడి మొదలైంది. అందరి ఇళ్లు స్వీట్ బాక్సులతో నిండిపోతోంది. పండుగ సందర్భంగా వచ్చిన మిఠాయిలను తినే విషయంలో చాలా మందికి డౌట్. ఎందుకంటే ఏది ఆరోగ్యానికి మంచిదనే ప్రశ్న మొదలవుతుంది.  పండుగ పూట షుగర్ బాధితులు ఆహారం, పానీయాలు మానేయడం కష్టం. ఈ సందర్భంగా మధుమేహ బాధితులు మిఠాయిలు తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. దీపావళి రోజు స్వీట్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. డయాబెటిక్ బాధితులు రక్తంలో చక్కెరను నియంత్రించాలని కోరుకుంటారు. అప్పుడు తీపి ఆహారం కోసం కోరికను నియంత్రించడం కంటే.. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే స్వీట్లను తినండి. డయాబెటిక్ పేషెంట్లు పండగ రోజు స్వీట్లు ఎక్కువగా తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా 300కి చేరుకుంటుంది. పెరిగిన చక్కెర తరచుగా మూత్రవిసర్జన, వాంతులు, లూజ్ మోషన్స్‌తో ఇబ్బంది పడాల్సి రావొచ్చు. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉండాలంటే పండుగ సందర్భంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి స్వీట్లు తినాలో తెలుసుకుందాం.

అంజీర్ బర్ఫీ..

మధుమేహ బాధితులు దీపావళి సందర్భంగా అంజూర్‌తో చేసిన మిఠాయిలను తీసుకోవచ్చు. మధుమేహాన్ని నియంత్రించడంలో అంజీర్ స్వీట్లు చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. అత్తి పండ్లలో ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్లు ఎ, బి, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

అంజీర పండ్ల నుండి తయారుచేసిన బర్ఫీ షుగర్ పేషెంట్ల కోరికలను నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తుంది. మీరు ఇంట్లో కూడా అత్తి పండ్ల స్వీట్లను తయారు చేసుకోవచ్చు లేదా మీరు వాటిని మార్కెట్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. అత్తిపండ్లు రుచిలో తీపిగా ఉంటాయి. ఇది స్వీట్ తినాలనే కోరికను కంట్రోల్ చేస్తుంది. అత్తి పండ్లలోని సహజ చక్కెర రక్తంలో చక్కెర పెరగడానికి అడ్డుకుంటుంది.

మఖానా ఖీర్ రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది..

మఖానా అటువంటి డ్రై ఫ్రూట్‌లో ఒకటి. దీనిని తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే మఖానాలో మంచి మొత్తంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కనిపిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీపావళి రోజున మఖానా ఖీర్ తింటే రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది. మీరు ఇంట్లోనే మఖానా ఖీర్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. మఖానాను పాలలో వేసి మిక్సీలో గ్రైండ్ చేసి గ్యాస్‌పై చిక్కబడే వరకు ఉడికించాలి. ఇప్పుడు అందులో బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, ఎండుద్రాక్ష వేసి చల్లారిన తర్వాత తినాలి.

స్వీట్లు తిన్న తర్వాత ఈ విషయాలను గుర్తుంచుకోవాలి

  • షుగర్ లెవల్స్‌ను చెక్ చేస్తూ ఉండండి. డయాబెటిస్ మెడిసిన్ తీసుకోండి.
  • కలబంద, పుదీనా, నిమ్మరసం తీసుకోండి.
  • నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తాగాలి.
  • రాత్రి ఆలస్యంగా మేల్కొలపడం మానుకోండి. సమయానికి రాత్రి పోండి. సమాయానికి భోజనం చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..