AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Australia ODI Captain: 18 ఏళ్లకే 3 ఫార్మాట్లలో అరంగేట్రం.. ఆ తర్వాత గాయంతో 6 ఏళ్లు దూరం.. కట్ చేస్తే.. వన్డే సారథిగా సరికొత్త రికార్డు..

Pat Cummins: క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే జట్టుకు కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌ను నియమించింది. ఈ బాధ్యతలు చేపట్టిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా కమిన్స్ రికార్డ్ నెలకొల్పాడు.

Australia ODI Captain: 18 ఏళ్లకే 3 ఫార్మాట్లలో అరంగేట్రం.. ఆ తర్వాత గాయంతో 6 ఏళ్లు దూరం.. కట్ చేస్తే.. వన్డే సారథిగా సరికొత్త రికార్డు..
Pat Cummins
Venkata Chari
|

Updated on: Oct 18, 2022 | 5:28 PM

Share

ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇప్పుడు వన్డే జట్టు కమాండ్‌ను కూడా చేపట్టనున్నాడు. వన్డేల నుంచి ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ తర్వాత, క్రికెట్ ఆస్ట్రేలియా ఈ బాధ్యతను పాట్ కమిన్స్‌కు అప్పగించింది. వన్డే జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పాట్ కమిన్స్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అతను ఆస్ట్రేలియా నుంచి వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్న మొదటి ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా 27వ సారథిగా ఎన్నికయ్యాడు.

పాట్ కమిన్స్ 18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం కమిన్స్ వయస్సు 29 సంవత్సరాలు మాత్రమే. తన 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో టెస్ట్, వన్డే కెప్టెన్సీని చేపట్టడానికి ముందు ఎంతో కష్టడాల్సి వచ్చింది. అడుగడుగునా అడ్డంకులు వచ్చినా.. తన ప్రయాణాన్ని మాత్రం ఆపలేదు. అరంగేట్రం తర్వాత, గాయం కారణంగా దాదాపు 6 సంవత్సరాల పాటు టెస్ట్ జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఆడేవాడు.

ఇవి కూడా చదవండి

గాయంతో ఆటకు 6 సంవత్సరాలు దూరం..

కమిన్స్ తన టీ20I అరంగేట్రం 13 అక్టోబర్ 2011న చేశాడు. అలాగే వన్డే అరంగేట్రం 19 అక్టోబర్ 2011న, 17 నవంబర్ 2011న టెస్ట్ అరంగేట్రం చేశాడు. 35 రోజుల వ్యవధిలో ఈ ఆటగాడు క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసి, సరికొత్త చరిత్ర నెలకొల్పాడు. అయితే టెస్ట్‌ల్లో అరంగేట్రం తర్వాత గాయంతో దాదాపు 6 సంవత్సరాల పాటు టెస్ట్ క్రికెట్‌కు దూరమయ్యాడు. నడుము గాయం కారణంగా లాంగ్ బౌలింగ్ చేయలేకపోయాడు. వన్డే, టీ20 క్రికెట్‌లో మాత్రమే కనిపించాడు. పాట్ కమిన్స్ 2017లో భారత పర్యటన నుంచి అంటే 6 సంవత్సరాల తర్వాత టెస్ట్ క్రికెట్‌కు రీఎంట్రీ ఇచ్చాడు.

గత సంవత్సరం నుంచి టెస్ట్ జట్టు సారథ్యం..

2017 నుంచి ఇప్పటి వరకు పాట్ కమిన్స్ ఆస్ట్రేలియా జట్టు కోసం నిలకడగా రాణిస్తున్నాడు. గతేడాది టెస్టు కెప్టెన్సీకి టిమ్ పైన్ వీడ్కోలు పలికినప్పుడు పాట్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. అలాగే ఆరోన్ ఫించ్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వడంతో క్రికెట్ ఆస్ట్రేలియా పాట్‌పై విశ్వాసం వ్యక్తం ఉంచింది.