Monkey Attack: వామ్మో.. ఇదేం కోతిరా.. ఒక్క పంచ్‌కే చాంతాడంత యువకుడిని పడగొట్టేసిందిగా..

ఇంటి వద్దకు వచ్చిన కోతిని తరిమేందుకు ఒక వ్యక్తి ప్రయత్నిస్తాడు. దాని మీదకు రాయి విసిరేందుకు కిందకు వంగి రాయిని తీయబోయాడు. అయితే ఆ వ్యక్తి చర్యను గమనించిన ఆ కోతి ఒక్కసారిగా అతడి మీదకు దూకుతుంది.

Monkey Attack: వామ్మో.. ఇదేం కోతిరా.. ఒక్క పంచ్‌కే చాంతాడంత యువకుడిని పడగొట్టేసిందిగా..
Monkey Attack
Follow us
Basha Shek

|

Updated on: Oct 21, 2022 | 3:07 PM

గతంలో అడవులకు మాత్రమే పరిమితమైన వానరాలు ఇప్పుడే మనుషులు ఉండే పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇళ్లు, ఆలయాలు, పాఠశాలల్లోకి చొరబడుతూ వస్తువులను ఎత్తుకెళ్లడం, అడ్డొచ్చిన వారిపై దాడికి పాల్పడడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో మరొకటి సోషల్‌ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఇంటి వద్దకు వచ్చిన కోతిని తరిమేందుకు ఒక వ్యక్తి ప్రయత్నిస్తాడు. దాని మీదకు రాయి విసిరేందుకు కిందకు వంగి రాయిని తీయబోయాడు. అయితే ఆ వ్యక్తి చర్యను గమనించిన ఆ కోతి ఒక్కసారిగా అతడి మీదకు దూకుతుంది. దీంతో అతడు అదుపు తప్పి కిందపడ్డాడు. ఆ షాక్‌ నుంచి అతడు తేరుకుని పైకి లేచి కోతి కోసం అటూ ఇటూ చూస్తాడు. అయితే అప్పటికే అది అక్కడి నుంచి జారుకుంటుంది.

ఈ ఘటన తిరువనంతపురంలో చోటుచేసుకుంది. ఒక ట్విట్టర్‌ యూజర్‌ పోస్ట్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇప్పటికే ఐదు లక్షల మందికిపైగా ఈ వీడియోను వీక్షించడం విశేషం. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు, రియాక్షన్‌లు పెడుతున్నారు. కోతి జాన్‌సేన (డబ్ల్యూడబ్ల్యూఈ బాక్సర్‌)గా మారిందని ఒక్క పంచ్‌కే పడగొట్టేసిందని ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు. ఈ కోతి చాలా డేంజరంటూ, వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలంటూ మరికొంతమంది నెటిజన్లు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..