Family Dance: ఒకే స్టైల్ లో రిథమ్ తో డ్యాన్స్ చేస్తోన్న ఫ్యామిలీ సభ్యులు.. అద్భుతం అంటోన్న నెటిజన్లు
ఒక వ్యక్తి తన భార్య, కుమార్తెతో అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నది వైరల్ అవుతున్న వీడియోలో మీరు చూడవచ్చు. బ్యాగింగ్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతోంది.
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలతో నిండిపోతోంది. ఫన్నీ వీడియోల నుండి ఉద్వేగభరితమైన, ఆశ్చర్యకరమైన వీడియోలు ఇలా విభిన్న నేపథ్యంతో ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో చూడగలుగుతున్నాం. Facebook, Instagram, Twitter వంటి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల్లో సాంగ్స్, డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఒక కుటుంబం అద్భుతంగా డ్యాన్స్ చేస్తోంది. కుటుంబంలో భార్యాభర్తలు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ కుటుంబ సభ్యులు మొత్తం సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ డ్యాన్స్ వీడియో తప్పకుండా మీ హృదయాన్ని తాకుతుంది.
ఒక వ్యక్తి తన భార్య, కుమార్తెతో అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నది వైరల్ అవుతున్న వీడియోలో మీరు చూడవచ్చు. బ్యాగింగ్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతోంది. ఆ మ్యూజిక్ కు అనుగుణంగా ముగ్గురూ ఒకే స్టైల్‌లో ఒకే రిథమ్ లో డ్యాన్స్ చేస్తున్నారు. వీరు చేస్తున్న డ్యాన్స్ చూస్తుంటే ప్రొఫెషనల్ డ్యాన్సర్ కాదని అస్సలు అనిపించదు. వాస్తవానికి.. ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లా ఒకే రీతిలో నృత్యం చేయడం చాలా అద్భుతం అనిపిస్తుంది. ఈ భార్యాభర్తలు, కూతురి డ్యాన్స్‌లో కూడా అలాంటి రిథమ్ కనిపిస్తోంది. మీరు సోషల్ మీడియాలో వివిధ రకాల డ్యాన్స్ వీడియోలను తప్పక చూసి ఉంటారు. కానీ ఒకే స్టైల్‌లో ఫ్యామిలీ డ్యాన్స్ చేయడం మీరు చాలా అరుదుగా చూస్తారు.
ఫ్యామిలీ డ్యాన్స్ వీడియో
View this post on Instagram
ఈ డ్యాన్స్ వీడియో చాలా అద్భుతంగా ఉంది. ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో shuffledance.tube లో షేర్ చేయబడింది. ఇప్పటివరకు ఒక లక్షా 34 వేల వ్యూస్ ను సొంతం చేసుకుంది. 4 వేల మందికి పైగా లైక్ చేసారు.
అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల కామెంట్స్ చేశారు. ఇది అద్భుతంగా ఉందని కొందరు చెబుతుండగా.. వీరు అందరూ అసలు ఏ పాటపై డ్యాన్స్ చేస్తున్నారంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. అదే సమయంలో.. మా ఇంట్లో ఇలాంటి డ్యాన్స్ చేస్తే మా అమ్మ , నాన్న మైక్రోవేవ్ లేదా ఓవెన్ పగలగొడతారని ఒక వినియోగదారు తమాషాగా రాశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..