Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bride Vs Groom: ఎవరికైనా కోపం వస్తే ఇలాగే ఉంటుంది.. పెళ్ళికి ఆలస్యంగా వస్తున్న వరుడికి వధువు స్ట్రాంగ్ వార్నింగ్..

వైరల్ వీడియోలో వధువు గులాబీ రంగు లెహంగా ధరించి అందంగా ముస్తాబైంది. పెళ్లి బారాత్ సమయానికి వరుడు రాకపోవడంతో వధువుకి కోపం వచ్చింది. అంతేకాదు చాలా ఆత్రుతకు గురైంది.

Bride Vs Groom: ఎవరికైనా కోపం వస్తే ఇలాగే ఉంటుంది.. పెళ్ళికి ఆలస్యంగా వస్తున్న వరుడికి వధువు స్ట్రాంగ్ వార్నింగ్..
Bride Dials Groom
Follow us
Surya Kala

|

Updated on: Oct 20, 2022 | 7:48 AM

ప్రతి ఒక్క యువతీయువకుల జీవితంలో  పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. పెళ్లిరోజు కోసం కొంతమంది వధువు, వరుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మరికొందరు చాలా టెన్షన్ కలిగి ఉంటారు. ముఖ్యంగా వధువు తన పెళ్లి చూపుల నుండి తన పెళ్లి జరిగే వరకూ అనేక ఆలోచనలను ఆలోచిస్తుంది. తన కుటుంబాన్ని విడిచిపెట్టి కొత్త కుటుంబంలోకి వెళ్లాలనే ఆలోచనల వరకు ఆమె మనస్సులో చాలా విషయాలు ఉంటాయి. ఆమె అనేక భావోద్వేగాలతో నిండిపోతుంది. అయితే పెళ్లి కి సంబంధించిన అనేక వీడియోలు నిరంతరం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లికి ఆలస్యమైనందుకు వరుడితో ఒక వధువు వాగ్వాదానికి దిగినట్లు ఆ కాల్ లో చూడవచ్చు.

వైరల్ వీడియోలో వధువు గులాబీ రంగు లెహంగా ధరించి అందంగా ముస్తాబైంది. పెళ్లి బారాత్ సమయానికి వరుడు రాకపోవడంతో వధువుకి కోపం వచ్చింది. అంతేకాదు చాలా ఆత్రుతకు గురైంది. ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది. కాబోయే జంట సంభాషణలో వరుడు సంభాషణ వినబడనప్పటికీ.. అతని ప్రతిస్పందన వధువుకు కోపం తెప్పించినట్లు అనిపిస్తుంది. “మీకు ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తుందా.. రావాల్సిన అవసరం లేదు, దయచేసి ఇక రావద్దు అంటూ కోపంతో తనకు కాబోయే వరుడిపై అరిచింది.”

ఇవి కూడా చదవండి

ఇది షాకింగ్ కలిగించే విషయమే.. పెళ్లికి రావద్దని వధువు వరుడిని కోరింది. అయితే.. ఒక క్షణం తర్వాత, వధువు మళ్లీ “జల్దీ నిక్లో యార్, త్వరగా బయలు దేరు..  దయచేసి, బై” అని చెప్పడం వినబడుతుంది.

వీడియోలోని ఈ దృశ్యం చాలా ఫన్నీగా ఉంది. కానీ వధువుపడే ఒత్తడి తెలియజేస్తుంది. 

“bridal_lehenga_designn” అనే పేజీ ద్వారా షేర్ చేయబడిన వీడియో 142K వ్యూస్, వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్‌ను సొంతం చేసుకుంది.

నెటిజన్లు వధువుతో కనెక్ట్ అయ్యారు. ఆమె వరుడిని తిట్టిన విధానాన్ని ఇష్టపడ్డారు. ఈ అమ్మాయి కూడా నాలాగే ఉందని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు పెళ్ళికి ముందే ఇలాగే ఉంటే.. ముందుకు మీరు మెరుగైన జీవితం గడపడానికి దైర్యం ఇవ్వమని ఆ దేవుడిని కోరుతున్నా అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..