Desi Treatment: గ్యాస్ నొప్పికి దేశీయ ట్రీట్మెంట్.. వీడియో చూసి.. కిడ్నీలు జాగ్రత్త అంటోన్న నెటిజన్లు..
ఒక వ్యక్తి మరో వ్యక్తి కడుపుని కుదుపుతో చాలాసార్లు నొక్కడం వీడియోలో మీరు చూడవచ్చు. దీంతో పాటు చేతిలో ఓ చిన్న సాధనంతో ఆ వ్యక్తి పొట్టపై పదే పదే కొట్టడం ప్రారంభించాడు.

కడుపులో గ్యాస్ ఏర్పడడం చాలా సాధారణ సమస్య. చాలా మంది ఈ సమస్యను ఎప్పటికప్పుడు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్య చాలా మందిలో తరచుగా ఉంటుంది. దీనికి కారణం ఆహారపు అలవాట్లతో పాటు, జీవన విధానంలో మార్పులని నిపుణులు భావిస్తున్నారు. చాలా మంది ప్రజలు గ్యాస్ లేదా అసిడిటీ సమస్యను తేలికగా తీసుకుంటారు. అయితే ఈ సమస్యలు ఒకొక్కసారి తీవ్ర ఇబ్బందులను కలిగిస్తాయి. ఈ వ్యాధి ఉన్న రోగులు తరచుగా ఇబ్బంది పడుతుంటారు. ఇంటర్నెట్‌లో ఇప్పటికే ఇందుకు సంబంధించిన అనేక నివారణ చర్యలు సూచిస్తునే ఉన్నారు. అయితే ప్రస్తుతం సోషల్నీ మీడియాలో వచ్చిన పద్ధతిని చూస్తే, మీ నవ్వును నియంత్రించుకోలేరు .
ఒక వ్యక్తి మరో వ్యక్తి కడుపుని కుదుపుతో చాలాసార్లు నొక్కడం వీడియోలో మీరు చూడవచ్చు. దీంతో పాటు చేతిలో ఓ చిన్న సాధనంతో ఆ వ్యక్తి పొట్టపై పదే పదే కొట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పేషెంట్ చాలా బాధ పడుతూ ఉన్నాడు.. అంతేకాదు.. గ్యాస్ లాక్, గ్యాస్ ఓవర్ అంటున్నాడు చికిత్స చేసే వ్యక్తి..! కడుపు నుండి గ్యాస్‌ను తొలగించే ఈ పద్ధతిని ప్రజలు చాలా సరదాగా తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో షేర్ అవుతుంది.




ఇక్కడ వీడియో చూడండి
Jin ko Gas ki takleef hai, unke liye desi ilaaz.?? pic.twitter.com/Clb9UZzeYd
— Deepak Prabhu (@ragiing_bull) October 17, 2022
ఈ 37 సెకన్ల క్లిప్‌ను @ragiing_bull అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేసారు. ఇది లక్ష కంటే ఎక్కువ వ్యూస్ ని సొంతం చేసుకుంది. ‘ఈ చికిత్స ద్వారా కిడ్నీ పాడైపోకూడదు’, ఇది దేశీ దేశీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్’ అని కామెంట్ చేశారు. ‘ఇటువంటి చికిత్సను తీసుకునే రోగులు స్వంత జవాబుదారీ కావాల్సి ఉందని ఉంటుందని పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
