Watch Video: కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్లే హఠాన్మరణం.. సీసీటీవీలో రికార్డైన షాకింగ్ విజువల్స్..
గుండె పోటు బారిన పడుతోన్న వారి సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతోంది. కండలు తిరిగిన శరీరమున్న యువకులు సైతం గుండె పోటుకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఇలాంటి చాలా సంఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వ్యక్తులు..
గుండె పోటు బారిన పడుతోన్న వారి సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతోంది. కండలు తిరిగిన శరీరమున్న యువకులు సైతం గుండె పోటుకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఇలాంటి చాలా సంఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. మొన్నటి మొన్న ఓ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి గుండె పోటుతో ప్రాణాలు వదిలిన వీడియో అందరినీ షాక్‌కి గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి సంఘటనే మరోటి చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఈ షాకింగ్ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. షాలిమార్ ప్రాంతానికి చెంది ఆదిల్ వ్యక్తి సొంతంగా జిమ్‌ను నిర్వరిస్తూ దాని బాధ్యతలు చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఆదిల్ జిమ్ ఆఫీస్‌లో కుర్చిపై కూర్చున్నాడు. అయితే అదే సమయంలో ఒక్కసారిగా గుండె పోటు రావడంతో ఆదిల్ కుర్చీపైనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అక్కడే ఉన్న కొందరు వెంటనే ఆదిల్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే ఆదిల్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
వైరల్ వీడియో..
In a shocking video shows #Ghaziabad #GymTrainer collapsing while sitting on a chair after suffering from #HeartAttack pic.twitter.com/sb2ka0bNbl
— Mantashahahahahmed (@mantashahahmed) October 19, 2022
ఇదంతా అక్కడే ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డైంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తి ఒక్కసారిగా ప్రాణాలు వదలడం అందరినీ షాక్‌కి గురి చేసింది. మృతుడికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో ఆదిల్ కుటుంబంబలో పెని విషాదం అలముకొంది.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..